Kajal Pasupathi: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న కాజల్.. ?

Kajal Pasupathi: కాజల్ పసుపతి.. కోలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రజలకు అంతగా తెలియకపోయినా.. తమిళంలో మాత్రం సుపరిచితమే. కో, మౌన గురు, కథమ్ కథమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక తెలుగులో అల్లు శిరీష్ నటించిన ద్విభాష చిత్రం గౌరవంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తూ తమిళ ప్రేక్షకులలో మంచి క్రేజ్ దక్కించుకుంది. తమిళ స్టార్ సూర్య నటించిన సింగం చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది.

ఓ ముఠాను పట్టుకునే సీన్ తో బాగా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఇప్పటికీ ఆ సీన్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. 2008లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాధరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ ని పెళ్లాడింది కాజల్. కానీ కొంతకాలానికే పలు విభేదాలు కారణంగా 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాండి మరో అమ్మాయి సిల్వియాని వివాహం చేసుకున్నారు. కాజల్ పసుపతి మాత్రం ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా ఉంటుంది.

అయితే గతంలో ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించిన కాజల్.. తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ” ఫైనల్ గా రెండో పెళ్లి చేసుకుంటున్నా. నన్ను క్షమించండి ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా” అంటూ పెళ్లి బట్టలో ఉన్న ఫోటోని షేర్ చేసింది. కానీ ఎవరిని పెళ్లి చేసుకోబోయేది మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఆమె నిజంగానే రెండో పెళ్లి చేసుకుంటుందా..? లేక ఏదైనా మూవీ స్టంటా..? అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు