Super star: కమల్ కి మహేష్ బాబు స్పెషల్ థ్యాంక్స్! ఎందుకంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు లోకనాయకుడు కమల్ హాసన్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. అదేంటి వీళ్ళేం కలిసి సినిమా చేయలేదు. ఈవెంట్ కి గెస్ట్ గాను రాలేదు, కనీసం టీజరో ట్రైలరో లాంచ్ చేయలేదు. మరి మహేష్ కమల్ కి ఎందుకు థ్యాంక్స్ చెప్పాడో అని మీరు అనుకోవచ్చు. కానీ మహేష్ చాలా ప్రత్యేకంగా ట్విట్టర్ పేజీలో థ్యాంక్స్ చెప్పాడు. అందులోనూ తన ఫ్యామిలీ కోసం.. అసలు విషయమేంటంటే…

కమల్ హాసన్ విక్రమ్ బ్లాక్ బస్టర్ తర్వాత తన కెరీర్లో మునుపెన్నడూ లేనంతగా వరుస సినిమాలు చేస్తూ షూటింగ్ లో బిజీ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం ఇండియన్2 షూటింగ్ లో పాల్గొంటున్న కమల్ హాసన్ ఆ సినిమా షెడ్యూల్ కోసం కమల్ హాసన్ శంకర్ టీమ్ తో కలిసి విజయవాడకి రావడం జరిగింది. ఈ సందర్బంగా అక్కడ ఘట్టమనేని అభిమానులు కమల్ హాసన్ ని మీట్ అయ్యి, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ కి రావాల్సింది గా కోరారు. దానికి ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించి, స్వయంగా వెళ్లి ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ మెమొరబుల్ మూమెంట్ పై మహేష్ బాబు ట్వీట్ వేసి ఆయనకి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు. ఆ ట్వీట్ లో “ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ మరియు దేవినేని అవినాష్ లకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని, నాన్న గారి విగ్రహాన్ని వారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని, ఈ ఈవెంట్ ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మహేష్ బాబు తెలిపాడు. ఇక ఈ ట్వీట్ తో విగ్రహాన్ని ఆవిష్కరింపచేసిన మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా సంతోషపడ్డారు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు