10 Habits to Become Mentally Strong: ఈ 10 అలవాట్లతో మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వండి

జీవితంలో అయినా, జాబ్ లో అయినా సక్సెస్ సాధించాలంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో పలు కారణాలతో బాగా మానసిక ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు నుంచి పెద్దల వరకూ అందరికీ వర్తిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటే ఏ పరిస్థితినైనా, ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మానసికంగా బలహీనంగా ఉండటం వల్ల మన పని తీరుపై ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మానసికంగా దృఢంగా ఉండాలంటే జీవనశైలిని, ఆలోచనలను మార్చుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండేందుకు మీకోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం.

ఈ 10 అలవాట్లతో మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వండి.

1. నమ్మకం

- Advertisement -

మన మీద మనకు నమ్మకం ఉంటే ఎలాంటి పరిస్థితినైనా సులభంగా ఎదుర్కోగలుగుతాము. తమ స్వంత సామర్థ్యాన్ని నమ్మే ఏ ఒక్కరు కూడా జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందరు.

2. నాలెడ్జ్ పెంచుకోండి

జీవితంలో ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివైనా సరే… వాటిని ఎదుర్కోవాలంటే ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మంచి పుస్తకాలు చదవడం ముఖ్యం. అలాగే మీలో స్ఫూర్తి నింపే వ్యక్తులతో సమయం గడపండి. మీరు నేర్చుకునే కొత్త స్కిల్స్ మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ అవుతాయి.

3. గోల్ సెట్ చేస్కోండి

మానసికంగా దృఢంగా ఉండేందుకు గోల్ సెట్ చేస్కోవచ్చు. జీవితంలో ఒక లక్ష్యం ఉంటే దానిపైనే ఎక్కువగా దృష్టి పెట్టగలం.

4. భావోద్వేగాలను నియంత్రించుకోండి

భావోద్వేగాలు పెరిగితే అవి మనల్ని బలహీనపరుస్తాయి. ఏ భావావేశం వచ్చినా మంచిదే కానీ మనసులో పెట్టుకోవడం మంచిది కాదు. అలాగే మీ భావాలను తల్లిదండ్రులతో పంచుకోండి. విషయం వారితో పంచుకోవడం వల్ల మనసులోనే ఉంచుకుని కుంగిపోకుండా కుదుటపడతారు. కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించడం చాలా ముఖ్యం. మీరు భావోద్వేగాలను నియంత్రించడానికి ధ్యానం, యోగా చేయవచ్చు.

5. పాజిటివ్ సెల్ఫ్ టాక్

పాజిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల మీ సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాకుండా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. సానుకూల స్వీయ-చర్చస్వీయ సందేహాన్ని సానుకూల ధృవీకరణలు మరియు నిర్మాణాత్మక స్వీయ-చర్చలతో భర్తీ చేయండి.

6. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో మానసికంగా దృఢంగా ఉండాలంటే కూడా అంతే ముఖ్యం. మానసికంగా దృఢంగా ఉండాలంటే మీ ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం తప్పనిసరిగా ఉండాలి.

7. గతాన్ని వదిలేయండి

గత పొరపాట్లు లేదా ప్రతికూల ఆలోచనల గురించి ఆలోచించడం మానుకోండి. జరిగిందేదో జరిగింది. ఆ తప్పులకు పరిష్కారాలు ఏంటి? కొత్త అవకాశాలు ఏంటి అనే విషయాలపై దృష్టి పెట్టండి. తప్పును మళ్లీ మళ్లీ రిపీట్ చేయవద్దు.

8. మార్పును అంగీకరించండి

జీవితంలో మార్పు మంచిదే. కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడానికి, వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి.

9. ఛాలెంజ్ కు రెడీగా ఉండండి.

మీకు ఎదురయ్యే ఛాలెంజ్ ను స్వీకరించి, మీ డెవలప్మెంట్ కు అవకాశాలుగా మార్చుకోండి. ఎదురుదెబ్బల నుండి తిరిగి పుంజుకోవడం నేర్చుకోండి.

10. సెల్ఫ్ కేర్

ఇక సెల్ఫ్ కేర్ కూడా చాలా ముఖ్యం. సమయానికి తగ్గట్టుగా వ్యాయామం, పోషకాహారం, విశ్రాంతి వంటివి తీసుకుంటూ ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వండి.

10 Habits to Become Mentally Strong

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు