Nithiin : మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్

హీరో నితిన్, హీరోయిన్ క్రుతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా మారుతున్నాడు. శ్రేష్టా మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన రా.. రా.. రెడ్డి పాట, ట్రైలర్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రా.. రా.. రెడ్డి పాట యూట్యూబ్ లో రికార్డులను నమోదు చేస్తుంది. అలాగే ట్రైలర్ అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుపుకుంది.

ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం సినిమా మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంటుందని అన్నారు. అలాగే ”నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి అయింది. ఇన్ని ఏళ్లు ఇక్కడ ఉన్నానంటే, దానికి కారణం అభిమానులు పంచిన ప్రేమనే. మీ అందరి కోసం మరో 20 ఏళ్ల అయినా కష్టపడతాను. సినిమాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో మణిశర్మ కింగ్ అంటారు. కానీ, మహతి స్వర సాగర్‌ తండ్రిని మించిన తనయుడు. సాగర్ అద్భమైన మ్యూజిక్ ఇచ్చాడు.” అని అన్నాడు. అలాగే సముథ్ర ఖని నటన, వెన్నెల కిషోర్ కామెడీ ఆకట్టుకుంటుందని అన్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా వక్కంతం వంశీ, మెహర్ రమేష్, మేర్లపాక గాంధీ వచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు