Kushboo: నా తండ్రి లైంగికంగా వేధించేవాడు

విక్టరీ వెంకటేష్ నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు. ఆ చిత్రంతోనే కుష్బూ హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. కలియుగ పాండవులు తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కుష్బూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కుష్బూ తెలుగులో స్టాలిన్, యమదొంగ, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. కుష్బూ పొలిటికల్ గా కూడా బిజీగా ఉంటుంది. ఈ మధ్యన కుష్బూ జబర్దస్త్ జడ్జిగా కూడా మారిన సంగతి తెలిసిందే. కుష్బూ నటిగా రాణిస్తూనే పాలిటిక్స్ లో కూడా కీలక పాత్ర వహిస్తున్నారు.

దీనితో ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఉంటున్నారు. ప్రతి అంశం గమనిస్తున్నారు. కెరీర్ మంచిగా సాగుతున్న సమయంలోనే ఆమె దర్శకుడు సుందర్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు అవంతిక, ఆనందిక ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తాజాగా కుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల వయసు నుంచి తాను లైంగిక వేధింపులకు గురయ్యానని కుష్బూ వెల్లడించారు. తన తండ్రి నుంచే ఈ వేధింపులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

భార్య, పిల్లలను కొట్టడం, కుమార్తెను లైంగికంగా వేధించడం తన జన్మ హక్కుగా భావించేవాడని తెలిపారు. తనకు 15 సంవత్సరాల వయసు వచ్చాక అతనిని ఎదిరించడం ప్రారంభించారని, 16 ఏళ్లకు తమను వదిలేసి వెళ్లిపోయాడని ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదనను బయటపెట్టారు. ప్రస్తుతం కుష్బూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా, ఇటీవలే కుష్బూ సుందర్ కు జాతీయస్థాయిలో కీలక పదవి లభించింది. బిజెపి నేత కుష్బూ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు.

- Advertisement -

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు