Kriti Sanon : లవ్ పై ఇంట్రెస్ట్..

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆది పురుష్ అనే సినిమా చేసింది. రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్రలో కృతి సనన్ కనిపించబోతుంది. రావణాసుర పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ నటించాడు. ఇది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉండగా, తాజాగా ఈ స్టార్ హీరోయిన్ నటించిన షెజాదా నేడు విడుదలైంది. ప్రీమియర్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అలా వైకుంఠపురంలో అనే సినిమాకు అధికారిక రీమేక్. దీనిలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించాడు. అయితే కృతి సనన్ వరుసగా కమర్షియల్ సినిమాలే చేస్తుంది. అయితే తనకు లవ్ స్టోరీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

తనకు స్వచ్ఛమైన లవ్ స్టోరీస్ ల కోసం వెయిట్ చేస్తున్నట్టు వెల్లడించింది. అలాంటి స్టోరీస్ వస్తే.. తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చింది. అలాగే తనకు లవ్ స్టోరీలతో వచ్చే పాత్రలే సెట్ అవుతాయని తెలిపింది. కాగా ఆది పురుష్ రిలీజ్ తర్వాత లవ్ స్టోరీస్ నేపథ్యంలో వచ్చే సినిమా స్టోరీలపై ఫోకస్ చేయనున్నట్టు తెలిపారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు