Kollywood : ఇంటర్నేషనల్ స్థాయికి మరో సౌత్ సినిమా

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం PS1. చోళ రాజుల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. అంతే కాదు.. ఈ హిస్టారికల్ సినిమా విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది. దీంతో ఈ చిత్రానికి రెండో పార్ట్ ను కూడా తెరకెక్కించే పనిలో ఉన్నాడు డైరెక్టర్ మణిరత్నం.

ఇదిలా ఉండగా పొన్నియిన్ సెల్వన్ :1 ఇప్పటికే కోలీవుడ్ అనేక ఘనతలను సాధించింది. తాజాగా మరో అరుదైన ఘనత సాధించడానికి మరింత ముందుకు వెళ్లింది. 16వ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వివిధ క్యాటగిరీలో పొన్నియిన్ సెల్వన్ ఏకంగా ఆరు నామినేషన్స్ లో నిలిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ సంగీతం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్, ఉత్తమ సినిమాటోగ్రఫీ మరియు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌లకు ఎంపికైంది.

కాగా పొన్నియిన్ సెల్వన్ :1 కి A.R రెహ్మాన్ సంగీతం ఇవ్వగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా బాధ్యత వహించారు. ఎన్నో హిట్ సినిమాలకి పని చేసిన తోట తరణి ఈ చిత్రానికి కూడా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యహరించారు. రవి వర్మా సినిమాటోగ్రఫీ చేయగా ఏక లఖాని కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి ప్రశంశలు అందుకున్నారు.

- Advertisement -

కాగా సౌత్ నుంచి ఇప్పటికే RRR చిత్రం ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డులు దక్కించుకుంటున్న సమయంలో పొన్నియిన్ సెల్వన్ కూడా అవార్డుల వేటలో ఉండటంతో సౌత్ సినిమా స్థాయి మరోసారి పెరిగింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు