Ketika Sharma: మెగా ఆఫర్

టాలీవుడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో.. కేతిక శర్మ కూడా ఒకరు. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ, అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ సినిమాలో కేతిక శర్మకు యూత్ బాగానే కనెక్ట్ అయ్యారు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో ఈమెకు గుర్తింపు పెద్దగా రాలేదు. దీని తర్వాత మరో యంగ్ హీరో నాగ శౌర్యతో లక్ష్య సినిమా చేసింది. ఈ సినిమాకు కేతిక కెరీర్ కు ఉపయోగపడలేదు.

కొంత గ్యాప్ తర్వాత కేతికకు మెగా ఆఫర్ వచ్చింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాలో ఛాన్స్ వచ్చింది. వైష్ణవ్ తేజ్ ఇప్పటికే ఉప్పెన హిట్ తో సూపర్ ఫామ్ లో ఉండటంతో ఈ సినిమాతో అయినా కలిసొస్తుందని అనుకున్నారు. కానీ, ఆ సినిమా కూడా ఫెయిల్ అయింది. దీంతో ఈ అందాల భామ నటించిన మూడు సినిమాలు కూడా చెదు అనుభావాన్నే ఇచ్చాయి. అయినా ఈ భామకు మరోసారి మెగా ఆఫర్ వచ్చింది.

ఇప్పటికే వైష్ణవ్ తేజ్ తో రొమాన్స్ చేసిన కేతికకు ఇప్పుడు అన్న సాయి ధరమ్ తేజ్ కు జోడీగా నటించే అవకాశం వచ్చిందని టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి వినోదయ సీతం తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి విధితమే. ఈ సినిమాలో సాయి ధరమ్ కు జోడీగా కేతిక శర్మను చిత్ర యూనిట్ ఎంపిక చేసిందని సమాచారం. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 14న జరగబోతున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

అయితే ఈ మెగా సినిమా అయినా, కేతిక కెరీర్ కు ఉపయోగపడుతుందా? లేదా ఎప్పటి లాగే మరోసారి పరాజయాన్ని మూటగట్టుకుంటుందా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు