Katrina Kaif : భాషలతో సంబంధం లేదు

బాలీవుడ్ నటీనటులు వరుసగా సౌత్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సౌత్ సినిమాల్లో కనిపించారు. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించాడు. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ సౌత్ సినిమాలు చేయడానికి సిద్ధం అంటుంది. వారు ఎవరో కాదు.. కత్రినా కైఫ్.

కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న తర్వాత బాలీవుడ్ లో చేస్తున్న మొదటి చిత్రం ఫోన్ బూత్. సిద్ధాంత్ చతుర్వేది దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది. హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా సౌత్ సినిమాలపై కత్రినా కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల కోలీవుడ్ లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం పొన్నియిన్ సెల్వన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ కీలక పాత్రలో కనిపించింది. ఈ పొన్నియిన్ సెల్వన్ చిత్రం విజయంపై కత్రినా స్పందించింది. తన జీవితంలో ఇలాటి అద్భుతమైన చిత్రం ఎప్పుడూ చూడలేదంటూ కొనియాడింది. మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, రెహమాన్ సంగీతం అందరినీ విపరీతంగా ఆకట్టుకుందని తెలిపింది. తనకు కూడా ఇలాంటి సినిమా చేయాలని ఉందని ప్రకటించింది.

- Advertisement -

తనకు భాషలతో సంబంధం లేదని, మంచి కథ వస్తే సౌత్ డైరెక్టర్ లతో కూడా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. కాగా కత్రినా కైఫ్.. తెలుగులో వెంకటేష్ తో మల్లీశ్వరీ, బాలయ్య తో అల్లరి పిడుగు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు