Jyothika: సూర్య అంటే అసహ్యం.. కానీ..!

Jyothika.. గత ఏడాది క్రితం నుంచి కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిక – సూర్య మధ్య విడాకుల వార్తలు తెగ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. సూర్య అమ్మ నాన్నలతో జ్యోతికా గొడవ పడిందని.. అందుకే పిల్లలతో కలిసి ముంబైలో సెటిల్ అయిందంటూ వార్తలు వినిపించాయి.. కానీ పిల్లల భవిష్యత్తు కోసమే తామ ముంబైలో ఉంటున్నామంటూ సూర్య క్లారిటీ ఇచ్చారు.. అయినా సరే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని.. అందుకే జ్యోతిక తమిళనాడుకి అసలు వెళ్లడం లేదు అని.. ఇక త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని చాలా ఘాటుగా స్పందించింది జ్యోతిక..

Jyothika: Jyothika comments about Suriya..!
Jyothika: Jyothika comments about Suriya..!

సూర్య అంటే ఆ విషయంలో అసహ్యం..
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక తన భర్త సూర్యా పై రీసెంట్గా షాకింగ్ కామెంట్స్ చేసింది.. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. జ్యోతిక మాట్లాడుతూ.. సూర్య లో తనకు నచ్చని విషయం ఒకటి వుందని తెలిపింది జ్యోతిక.అదేమిటంటే సూర్య బాత్రూంలో ఎక్కువ సమయం గడుపుతారు..అలా చేయడం నాకు నచ్చదు .. ఒక్కోసారి ఓపిక నశించి అసహ్యంగా కొంతసేపు ఎలా ఉంటారు అనిపిస్తుంది అంటూ సరదాగా కామెంట్లు చేసింది జ్యోతిక.. జ్యోతిక చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

సూర్యలో నాకు నచ్చేది అదే..
సూర్య అందరినీ గౌరవిస్తారు.. అందరి కోసం టైం కేటాయిస్తారు.. సూర్యా లో ఈ విషయం నాకు బాగా నచ్చుతుంది.. సూర్యాకు సహనం ఎక్కువ.. ఆయన స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు.. ముఖ్యంగా అవతల వ్యక్తి మాట్లాడేది చాలా ఓపికగా వింటారు.. ఇక నేను కూడా ఇంట్లో ఎక్కువగా మాట్లాడతాను.. నేను మాట్లాడిన ప్రతిసారి చాలా శ్రద్ధగా సూర్య వింటూ ఉంటారు.. ఇది సూర్యాలో నాకు నచ్చే విషయం అంటూ జ్యోతిక తెలిపింది.. అంతేకాదు సూర్య ఎంతటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకోగలరని తెలిపారు జ్యోతిక..

- Advertisement -

సూర్యతో సినిమాపై జ్యోతిక కామెంట్స్..
గతంలో వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ.. చాలా రోజుల నుంచి నా సినిమాలలో నేనే మెయిన్ లీడ్ చేస్తున్నాను.. అందుకే నా సినిమాలలో వేరే హీరో కావాలని కూడా అనుకోవడం లేదు ఒకవేళ మంచి కథ ఉంటే అది కూడా బాలీవుడ్లో సూర్యతో కలిసి నటించాలని ఉంది అంటూ తన కోరికను వెల్లడించింది జ్యోతిక.. ఇకపోతే సూర్య – జ్యోతిక ఎంత రొమాంటిక్ కపులో అందరికీ తెలిసిందే.. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్న సూర్య.. 45 ఏళ్ల వయసులో జ్యోతిక ఇద్దరు కలిసి రొమాంటిక్ టూర్ వేశారు.. మంచు ప్రదేశంలో తమ టైంను స్పెండ్ చేస్తూ.. ఏకాంతంగా గడిపారు.. ఇటీవలే ఫిన్లాండ్ వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడ ఈ రొమాంటిక్ కపుల్ తమ సమయాన్ని తమ కోసం కేటాయిస్తూ చాలా ఎంజాయ్ చేసినట్లు సమాచారం.. మొత్తానికైతే వీరిద్దరి మధ్య వస్తున్న విడాకుల రూమర్స్ కి ఈ విధంగా చెక్ పెట్టారు ఈ బ్యూటిఫుల్ జంట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు