Dhamaka : రవితేజ, శ్రీ లీల జింతాక్

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి బోల్తా కొట్టిన మాస్ మహారాజా, ఈ ఏడాది ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. వరుస పెట్టి సినిమాలు లైన్ లో పెట్టేశాడు. రవితేజ ఈ ఏడాది ఏకంగా అరుడజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. వీటిలో “ధమాకా” కూడా ఒకటి. “నేను లోకల్”, “హలో గురు ప్రేమకోసమే” లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన త్రినాధరావు నక్కిన, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలోని “జింతాక్” అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ ను ఆగస్టు 18న 12:01 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ పై శ్రీ లీల కూర్చుని చిందులేస్తుంది.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియాా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, రామారావు ఆన్ డ్యూటీ నిరాశపరచడంతో ఈ ధమాకా పైనే రవితేజ ఆశలు పెట్టుకున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు