Janhvi Kapoor : అది ఓ కళాత్మక స్వేచ్ఛ

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫోటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. రణ్ వీర్ న్యూడ్ ఫోటో షూట్ పై కొంతమంది వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొంతమంది సపోర్ట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించారు. బాలీవుడ్ అంటే ఇలాగే ఉంటుంది, బాలీవుడ్ ను బాయికాట్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. కొన్ని రోజులు ట్విట్టర్ లో బాయికట్ బాలీవుడ్ అనేది ట్రెండింగ్ లో కూడా ఉంది.

రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ పై ముంబైలో కొంతమంది కేసు కూడా పెట్టారు. అలాగే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ వ్యతిరేకతల మధ్య రణ్ వీర్ సింగ్ కు కొంత మంది మద్దతుగా కూడా నిలిచారు. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో పాటు కొంతమంది ప్రముఖులు రణ్ వీర్ కు మద్దతు ప్రకటించారు.

తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ రణ్ వీర్ సింగ్ కు సపోర్ట్ చేసింది. రణ్ వీర్ సింగ్ చేసిన దానిలో ఎలాంటి తప్పు లేదని కామెంట్ చేసింది. ”అది ఒక కళాత్మక స్వేచ్ఛ వంటిది అని నేను భావిస్తున్నారు. దీనిపై రణ్ వీర్ ను తప్పుబట్టాల్సిన పనిలేదు. న్యూడ్ ఫోటోపై విమర్శలు చేయడం, విశ్లేషించడం సరైన పద్దతి కాదని భావిస్తున్నాను” అంటూ జాన్వీ కపూర్ కామెంట్ చేసింది. జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు