Krithi Shetty : ‘మంచి మూడ్ కోసం..’

‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో స్థానం ఏర్పరచుకుంది. తాజాగా ఈ భామ నటించిన “ది వారియర్” ఇటీవల విడుదలై ఓకే అనిపించుకుంది. నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “మాచర్ల నియోజకవర్గం” లోనూ నటించింది. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో నడిచే ఈ సినిమాతో దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు.

ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకు స్వీట్లు అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. కానీ.. అవి చక్కరతో చేసినవి అయితే తనకి ఇష్టం ఉండదట. అలాగే బేబమ్మ తనకు మనసు బాగోలేనప్పుడు ఐస్ క్రీమ్ తింటానని తెలిపింది. అలా మనసు బాగోలేనప్పుడు ఐస్ క్రీమ్ తింటే తన మూడ్ ఇట్టే మారిపోతుందంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. ఇదిలా ఉండగా.. “మాచర్ల నియోజకవర్గం” సినిమాలో బేబమ్మ “స్వాతి” అనే పాత్గారలో నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ ను చిత్ర బృందం ఇప్పటికే రీవిల్ చేసింది. ఈ పోస్టర్ లో కృతి శెట్టి చాలా క్యూట్ గా, ముద్దుగా కనిపించింది. బేబమ్మను వెండితెరపై చూడాలంటే ఆగస్టు 12వ తేదీ వరకు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు