Pawan Kalyan: పవన్ మూడో భార్య ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హీరోగా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నారో ఇక మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తిగా కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమధ్య రాజకీయాలలో.. పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా ఈ అంశంపైనే ఇతర నాయకులు టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాకముందు నందిని రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

భార్య ఉండగానే ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్ తో సహజీవనం చేసి ఒక బిడ్డకు జన్మనిచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కొంతకాలం జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చి రష్యా కు చెందిన అన్నా లెజినోవా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

ఇకపోతే ఎప్పటికప్పుడు వీరికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ మూడో భార్యకు ఎంత ఆస్తి ఉంది అనే విషయం మరొకసారి వైరల్ గా మారింది. మరి ఆమె ఆస్తులు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అన్నాలెజనోవా ఆస్తి విలువ సుమారుగా రూ .2వేల కోట్లకు పై మాటే.. రష్యా లో మోడల్ నటిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు. దీనికి తోడు వారసత్వంగా కూడా కొన్ని ఆస్తులు వచ్చాయట. అంతేకాదు సింగపూర్లో ఆమె పేరుపై హోటల్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇలా మొత్తంగా రూ.2 వేల కోట్లకు ఈమె వారసురాలు అని సమాచారం.

- Advertisement -

పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 65% పూర్తి చేసుకుంది అంతేకాదు ఇందులో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగ గా కనిపించనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఇందులో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది .

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది మరి పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు