Hombale Films: హోంబలే నిర్మాణ సంస్థ పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా మారుమ్రోగుతున్న ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ఫిలిమ్స్.. కే జి ఎఫ్ సినిమా కి ముందు వరకు కన్నడలో తప్ప ఇలాంటి నిర్మాణ సంస్థ ఒకటి ఉందని ఎవరికీ తెలియదు. కానీ కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ గా.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో హోంబలే ఫిలిమ్స్ కొత్త సెన్సేషన్ గా మారిపోయింది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హిట్ పడితే డైరెక్టర్ కి లేదా హీరో కి పేరు వస్తుంది. కానీ ఒక నిర్మాతకు పేరు రావడం ఇదే మొదటిసారి… కేజిఎఫ్, కాంతారా, సలార్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో హోంబలే సంస్థ అధినేత విజయ్ కిరంగదూర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

రీసెంట్గా ఈ నిర్మాణ సంస్థ నుంచి విడుదలైన ప్రభాస్ సలార్ చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. దీంతో హోంబలే ఫిలిమ్స్ గతంలో ఎలాంటి సినిమాలు చేసింది..? నిర్మాత ఎవరు? అసలు ఈ హోంబలే అనే పేరు వెనుక ఉన్న అసలు విషయం ఏమిటి ? అనే విషయాలను నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇకపోతే తాజాగా హోంబలే సంస్థ అసలు హిస్టరీ ఇదే అంటూ ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.

సాధారణంగా నిర్మాణ సంస్థల పేర్లు అర్థమయ్యేటట్టే ఉంటాయి. కానీ ఈ హోంబలే అనే పేరు కాస్త వెరైటీగా ఉంది. అసలు హోంబలే అంటే అర్థం ఏమిటి అంటే ఇది ఒక అమ్మవారి పేరు అని తెలుస్తోంది. ఈ సంస్థ అధినేత విజయ్ సొంత ఊరు కర్ణాటకలోని మండ్య సమీపంలో ఉందట. ఆ ఊరి గ్రామ దేవత అమ్మ వారి పేరు హోంబాలమ్మ అని అంటున్నారు. ఇక అమ్మవారి పైన భక్తితోనే ఆ పేరును తన నిర్మాణ సంస్థగా పెట్టుకున్నారట విజయ్.

- Advertisement -

ఇకపోతే ఈ సంస్థను స్థాపించింది ఎవరో కాదు దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్. పునీత్ కి విజయ్ కిరంగదూర్ కి మంచి సాన్నిహిత్యం ఉంది.. ఈ క్రమంలోనే విజయ్ హోంబలే ఫిలింస్ పై తొలిచిత్రాన్ని పునీత్ హీరోగానే నిర్మించారు. ఆ తర్వాత ఇదే సంస్థలో పునీత్ మరో రెండు చిత్రాలు కూడా చేశారు. ఇక కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సలార్ మూవీ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు