Salaar: సలార్ లో “రాధా రామ” పాత్రను రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరోయిన్..!!

Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియ రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహ, ఈశ్వరి రావు ఇతర కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా భారీ స్పందన లభించింది.

అయితే పొగరు సినిమాలో విలన్ గా కనిపించి, అద్భుతంగా నటించిన శ్రీయ రెడ్డి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో శ్రియ రెడ్డి పోషించిన “రాధ రమ” పాత్ర కోసం మొదటగా ఓ స్టార్ హీరో కూతురుని అనుకున్నారట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆమె మరెవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. ఈ పాత్ర కోసం దర్శకుడు మొదట వరలక్ష్మి శరత్ కుమార్ ని సంప్రదించగా.. ఆమె సున్నితంగా తిరస్కరించిందట.

ఎందుకంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాలో నటిస్తే క్రేజ్ మొత్తం ప్రభాస్ కి వెళ్ళిపోతుందని, పైగా ఈ చిత్రంలో పృధ్విరాజ్, జగపతిబాబు వంటి స్టార్స్ ఉన్నప్పుడు తన పాత్రను ఎవరూ పట్టించుకోరనే చిన్న అపోహతో ఈ పాత్రను వదులుకుందుట వరలక్ష్మి. కానీ ఇప్పుడు సినిమా రిజల్ట్ చూసిన తర్వాత ఎంతగానో బాధపడుతుందట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు