Sports Backdrop : ఇంట్రెస్ట్ తగ్గింది గురు

ఈ బడ్జెట్ లో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది ప్రొడ్యూసర్ ఆలోచన. ఈ జోనర్ లో సినిమా చేస్తే సినిమా హిట్ అవుతుందని డైరెక్టర్ అభిప్రాయం. ఇలాంటి సినిమాలు చేస్తే, తన అభిమానులను హ్యపీగా ఉంటారనేది హీరో ఆలోచన. కానీ, ఎంత మందికి ఎన్ని ఆలోచనలు ఉన్నా, సినిమా హిట్ కొట్టాలంటే, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాపే ది బెస్ట్.

ఇప్పటికే ఇది చాలా సినిమాలతో ప్రూవ్ అయింది. తాజాగా వచ్చిన లైగర్ తో పాటు ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ “గని”, నాగ శౌర్య “లక్ష్య” మినిహా దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ ముందు మంచి ఫలితాలనే ఇచ్చాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాల్లో ఉండే, ఉత్కంఠ, భావోద్వేగాం, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతీ ప్రేక్షకుడికి కావాల్సిన సీన్స్ వీటిలో ఉంటాయి.

అందుకే కాబోలు ఈ జోనర్ లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్ అందుకున్నాయి. 1990లో అశ్విని నాచప్ప బయోగ్రఫి “అశ్విని” సినిమా నుండి నేటి “జర్సీ” వరకు ఏ ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ను నిరాశ పర్చలేదు. బాలీవుడ్ లో ఇదే జోనర్ లో వచ్చిన దంగల్ మూవీ 2,024 కోట్ల కలెక్షన్లు చేసి దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది.

- Advertisement -

కానీ, ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల వచ్చిన గని ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో అందరికీ తెలుసు. తాజాగా 180 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన లైగర్ సినిమా కూడా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేక పోయింది. భారీగా లాభాలు వస్తాయని అనుకున్నారు. కానీ కనీసం బ్రేక్ ఈవెన్ ను దాటడం కూడా కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలపై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ తగ్గిందని తెలిసిపోతుంది.

ఇక నైనా తెలుగు దర్శకులు ఈ అవుట్ డేటెడ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ను వదిలి కొత్త కథనాలతో సినిమాలు చేస్తారో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు