Sandeep Reddy’s Downfall: రాజమౌళి చెప్పింది నిజమే – ఆర్జీవీలానే సందీప్ రెడ్డి… ఇక కెరీర్ ఖతం?

రాజమౌళి… ఈ దిగ్గజ దర్శకుడు సందర్భం వచ్చినప్పుడు కొంత మంది డైరెక్టర్లను పొగుడుతూ ఉంటాడు. రీసెంట్‌గా యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగాను ఆకాశానికి ఎత్తేశాడు.

“ప్రతి సంవత్సరం కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తారు. పెద్ద సినిమాలు చేస్తారు. సూపర్ హిట్ సినిమాలు చేస్తారు. చాలా పేరు సంపాదిస్తారు. అది మనం చూస్తూనే ఉన్నాం.

But once in a while comes a director…
who will not only Shake the Auditions…
not only Shake the Industry
but also… సినిమా అంటే.. ఇలాగే తీయ్యాలి అని ఫార్ములాస్ ని కూడా షేక్ చేసే డైరెక్టర్ అప్పుడుడప్పుడు ఒకరు వస్తారు. అలాంటి డైరెక్టర్ నాకు తెలిసి ఎప్పుడో నా తరంలో మన తరంలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. దాని తర్వాత That Kind of director ఈ నార్మ్స్ ని ఫార్ములాస్ ని అన్నింటినీ పక్కన బెట్టి.. నేను ఇలాగే సినిమా తీస్తాను అనే డైరెక్టర్ Sandeep Reddy Vanga.”

- Advertisement -

అంటూ సందీప్ రెడ్డి గురించి రాజమౌళి గొప్పలు చెప్పాడు. అంతా బాగానే ఉంది. కానీ, ఇందులో ఒకటి మాత్రం నిజం అని చెప్పొచ్చు. అది రామ్ గోపాల్ వర్మ తర్వాత సందీప్ రెడ్డి వంగానే.

రామ్ గోపాల్ వర్మ్ కూడా తన కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన శివ, సర్కార్, రంగీలా లాంటి సినిమాలు ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక శివ సినిమా అయితే సినిమా ఇండస్ట్రీలో ఓ విప్లవాన్ని తీసుకువచ్చింది. దీని తర్వాత రామ్ గోపాల్ వర్మ నుంచి శివ లాంటి స్టైల్ లోనే చాలా సినిమాలు వచ్చాయి. కానీ, అవేవీ కూడా పెద్దగా హిట్ అవ్వలేదు.

ఎందుకు హిట్ అవ్వలేదు.. దీనికి కారణం ఏంటి అంటే… రామ్ గోపాల్ వర్మ స్టైల్ ని ఇప్పటికే ప్రేక్షకులు చూశారు. మళ్లీ అదే స్టైల్ లో సినిమాలు అంటే… యాక్సెప్ట్ చేయలేరు. రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ మార్పులు తీసుకువచ్చి గతంలో చేసిన సినిమాలతో సంబంధం లేకుండా తర్వాత చేసే సినిమాల్లో వేరియేషన్స్ చూపిస్తే.. రామ్ గోపాల్ వర్మ కెరీర్ ఇప్పుడు మరోలా ఉండేదేమో.

ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా కూడా రామ్ గోపాల్ వర్మలా.. ఫార్ములాస్ అన్ని పక్కన పెట్టి.. ఆనాటి అర్జున్ రెడ్డి కానీ, ఈనాటి యానిమల్ మూవీ గానీ చేశాడని చెప్పొచ్చు. కానీ, ఇప్పుడు అదే స్టైల్ లో ఇంకో మూవీ అంటే ఆడియన్స్ భరిస్తారా? భరించాలేరు.

అందుకు ఊదాహారణ… అప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ, దిగ్గజ దర్శకులను సైతం అభిమానులుగా మార్చుకున్న పూరి జగన్నాథ్. ఇంకా వీవీ వినాయక్… ఇలా చెప్పుకుంటూ పోతే… తమ పంథాను మార్చుకోకుండా ఒకే దోరణితో సినిమాలు చేస్తూ, డిజాస్టార్లను మూటగట్టుకుంటూ కెరీర్ ని నాశనం చేసుకున్న డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు.

ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా కూడా తన చేసే సినిమాల్లో మేకింగ్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, వేరియేషన్స్ చూపించకపోతే… ఆయన కెరీర్ కూడా డౌన్ ఫాల్ అవ్వడం తప్పదని చెప్పొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు