Pushpa 2 : బన్నీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కి గుండెపోటు… టెన్షన్ లో “పుష్ప” టీం

బాలీవుడ్ నటుడు, “పుష్ప” డబ్బింగ్ ఆర్టిస్ట్ హార్ట్ ఎటాక్ రావడంతో ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం “పుష్ప” టెన్షన్ నెలకొంది. “పుష్ప” టీంకు టెన్షన్ దేనికి? ఆ నటుడి ఆరోగ్యం ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే…

శ్రేయాస్ తల్పాడే… ఈ పేరుకు బాలీవుడ్ ప్రేక్షకులకు అయితే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక తెలుగు ప్రేక్షకులైతే కాస్త గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. “పుష్ప” సినిమాతో ఈ నటుడు, ఆర్టిస్ట్ పేరు పాన్ ఇండియా లెవెల్ లో మార్మ్రోగిపోయింది. అయితే ఈయన “పుష్ప” సినిమాలో నటించలేదు గానీ, ఈ మూవీ హిందీ వర్షన్ లో అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పాడు. ఇక “పుష్ప” మూవీ సౌత్ లో కంటే నార్త్ లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. శ్రేయాస్ కు ఈ మూవీ అద్భుతమైన గుర్తింపునిచ్చింది. అయితే తాజాగా ఈనట్లు గుండెపోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఆయనను ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశారని సమాచారం.

శ్రేయాస్ ప్రస్తుతం “వెల్కమ్ టు ది జంగిల్” అనే హిందీ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే రోజంతా ఆ మూవీ షూటింగ్లో హుషారుగా పాల్గొన్న ఆయన యాక్షన్ ఎపిసోడ్లకు స్పందించిన షూటింగ్ ను కూడా చేశారట. అప్పటిదాకా బాగానే ఉన్న ఆయన సాయంత్రం ఇంటికి చేరుకోగానే తనకు అసౌకర్యంగా అనిపిస్తుంది అంటూ కుటుంబ సభ్యులకు తెలిపాడట. తర్వాత కొన్ని నిమిషాల్లోనే హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలిపోయాడని సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు శ్రేయాస్ ను వెంటనే ముంబై అందేరి వెస్ట్ లో ఉన్న బెల్ ఏ వ్యూ అనే హాస్పిటల్ కు తరలించారు. కాలంలో ఆయన ఆస్పత్రికి చేరుకోవడంతో, అందించిన వైద్యులు ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజుల్లోనే శ్రేయాస్ డిస్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

శ్రేయాస్ ఇలా 47 ఏళ్ల వయసులోనే హార్ట్ ఎటాక్ బారిన పడడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. “పుష్ప” మూవీలో అల్లు అర్జున్ డైలాగ్స్ కు హిందీలో ప్రాణం పోసిన శ్రేయాస్, ఆ తర్వాత ఫుల్ ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్ గా “పుష్ప 2” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో బన్నీ పాత్రకు మరోసారి డబ్బింగ్ చెప్పాల్సిన శ్రేయాస్ కు గుండెపోటు రావడం “పుష్ప” టీం ను టెన్షన్ కు గురిచేసింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న శ్రేయాస్ త్వరలోనే ఆరోగ్యంగా బయటకు వస్తాడు అని తెలియడం “పుష్ప” టీంకు పెద్ద రిలీఫ్ అని చెప్పాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు