Guntur Kaaram: మళ్ళీ గెలికేసిన నాగవంశీ… ఏం హీక్కుంటావో హీక్కో అంటూ నెటిజన్ల మాస్ వార్నింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం” వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ విషయంలో ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేయగా, పాపులర్ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి మహేష్ బాబు ఫ్యాన్స్ ను కుక్కలతో పోల్చడం వారికి ఎక్కడో కాలేలా చేసింది. ఇక తాజాగా నిర్మాత నాగ వంశీ చేసిన ట్వీట్ మరోసారి రచ్చకు దారి తీసింది. అసలు ఆయన చేసిన ట్వీట్ ఏంటి? ఈ కొత్త వివాదం ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…

“గుంటూరు కారం” మూవీ నుంచి తాజాగా విడుదలైన “ఓ మై బేబీ” సాంగ్ ఆడియన్స్ కు ఏమాత్రం నచ్చలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ట్రోల్ చేశారు నెటిజెన్లు. దీనిపై రామ జోగయ్య శాస్త్రి తీవ్రంగా మండిపడడం, ఆ తర్వాత డామేజ్ కంట్రోల్ కింద హీరోయిన్ శ్రీలీలతో అదే పాటకు డాన్స్ వేయించడంతో వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందని అంతా భావించారు. కానీ “గుంటూరు కారం” నిర్మాత నాగ వంశీ మళ్లీ నెటిజెన్లను తన ట్వీట్ తో గెలిచేసాడు. ఈ నిర్మాత “మేమేం చేస్తున్నామో మాకు తెలుసు… జనవరి 12న మిమ్మల్ని కలుస్తాం” అంటూ ట్వీట్ చేశాడు. మరి దీంట్లో వివాదం ఏముంది అనుకుంటున్నారా? అయితే వివాదానికి కేవలం ఆ ట్వీట్ కారణం కాదు. ట్వీట్ తో పాటు వీడియోను షేర్ చేశాడు నాగ వంశీ. అందులో నోట్ అని స్పెషల్ గా మెన్షన్ చేసి మరీ “డోంట్ ఫైట్ ఆర్ ఆర్గ్యు విత్ ఎనీ వన్.. జస్ట్ డు” అంటూ ఒక వీడియోను షేర్ చేశాడు. అక్కడే నెటిజన్లకు మరింత మండింది.
అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి చేశాడు అనే విషయాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయకపోయినా, నెటిజన్లు మాత్రం నాగ వంశీ పై, మూవీపై మండిపడుతున్నారు. గతంలో యూవీ క్రియేషన్స్ సినిమాను ఎంత లేట్ చేసిన ఇలా అయితే రెస్పాండ్ కాలేదు. ఫాన్స్ డిమాండ్ ని ఫుల్ ఫిల్ చేయలేకపోతున్నారు, మళ్లీ ఇలా రివర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మాక్ చేస్తున్నారు. పాపం మహేష్ బాబు ఫ్యాన్స్ జాలిని కనబరుస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం మహేష్ బాబు ఫ్యాన్సీ ట్రోల్ చేస్తున్నారు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని, కనీసం వాళ్లకైనా న్యాయం చేయండి మిగతా వాళ్ళ సంగతి తర్వాత అంటూ సజెషన్ ఇస్తున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం అంటే ట్రైలర్ సాంగ్స్ ఇంకా ఏం రిలీజ్ చేయవా? అని ప్రశ్నిస్తుంటే, ఇంకొంతమంది మాత్రం మీరు ప్రొడ్యూసర్ అనే సంగతి మర్చిపోయారా? నీ బలుపు చూశాక మూవీని పైరసీ లో చూద్దాం అనుకుంటున్నాం ఏం పీక్కుంటావో పీక్కో… మూవీ లేదా సాంగ్ బాగుంటే భజన చేసేది ఫ్యాన్స్ ఏ కదా… అలాంటప్పుడు వాళ్ల నుంచి ఎదురయ్యే విమర్శలను తీసుకోకుండా ఈ బలుపు ఏంటి అంటూ నాగవంశీకి తిరిగి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వివాదం “గుంటూరు కారం” మూవీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు