Nasha: నాకూ డ్రెస్సులు ఇవ్వకుండా అవమానించారు – హన్సిక

ముంబై బ్యూటీ హన్సిక గురించి తెలియనివారు ఉండరు. ఆమె ఇప్పటికే టాలీవుడ్ లో ఓ చెరగని ముద్ర వేసుకున్నారు. అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముంబై బ్యూటీ హన్సిక మొదటి సినిమాతోనే యువత మతులు పోగొట్టింది. ముఖ్యంగా టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆపిల్ పిల్లగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు యువత హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన హన్సిక మొదటి సినిమా దేశముదురు తోనే స్టార్డం ని అందుకుంది. ఈ సినిమాకి గాను ఉత్తమ హీరోయిన్ గా అవార్డు కూడా అందుకుంది. ఆ తరువాత ఈ బ్యూటీ వరుస సినిమా అవకాశాలతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ అయిపొయింది

ఇది ఇలా ఉండగా… ముంబై బ్యూటీ హన్సిక తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానం గురించి వెల్లడించింది. ‘ఒకప్పుడు మాకు డ్రెస్సులు ఇవ్వడానికి డిజైనర్స్ ఆసక్తి చూపేవారు కాదు. సౌత్ హీరోయిన్ అంటూ బ్యాడ్ కామెంట్ చేసి అవమానించారు. కానీ నేను బాధపడలేదు. మరింత కష్టపడాలని అర్థమైంది. అయితే ఇప్పుడు ఆ డిజైనర్స్ వారు డిజైన్ చేసిన డ్రెస్ ధరించాలని బ్రతిమిలాడుతున్నారు. ఏదైనా ఈవెంట్ ఉంటే వారంతట వారే వచ్చి డ్రెస్ వేసుకోమని అడుగుతున్నారు. ఇంతకన్నా సక్సెస్ ఏముంటుంది’ అని తెలిపింది బ్యూటీ. కాగా, ఇటీవలనే హన్సిక పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు