Bheemla nayak : ఆ టాలీవుడ్ స్టార్ హీరోని ఘోరంగా అవమానించిన నిత్యామీనన్..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ ఒకరు. తన అందం, నటనతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిత్యామీనన్.. ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమె రెమ్యూనరేషన్ కంటే మంచి పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. 1998లో బాలనాటిగా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఇక 2010లో అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఇక అప్పటినుండి ఈమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా పద్ధతిగా ఉండే పాత్రలలో నటిస్తూ దూసుకుపోతోంది.

అయితే తాజాగా నిత్యకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు మరోసారి పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈమె కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ” బాబు బంగారం” సినిమాలో వెంకీ మామ కి జోడిగా నటించే అవకాశం వచ్చిందట. కానీ వెంకటేష్ తన పక్కన అంకుల్ లా ఉంటాడని, ఆ అంకుల్ పక్కన నేను హీరోయిన్ గా నటించడం ఏమిటని చెప్పి రిజెక్ట్ చేసిందట. నిత్యా ఇలా అనడంతో వెంకటేష్ సైతం బాగా ఫీలయ్యాడనే గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపించాయి. ఆ తరువాత బాబు బంగారం సినిమాలో నయనతారని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ న్యూస్ అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో నిత్యకి బాగా పొగరు అని విమర్శించారు కూడా..!

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు