Captain Miller : అవును.. మేము ఆరేళ్ళు మాట్లాడుకోలేదు… – జివి ప్రకాష్

Captain Miller : ప్రముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లెజెండరి సంగీత దర్శకుడు రెహమాన్ మేనల్లుడు అయిన జి వి ప్రకాష్ చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి పెద్ద పెద్ద స్టార్ హీరోలకు సైతం సంగీతమందిస్తున్నాడు. ఇక కొన్నేళ్ల కింద హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఒక పక్క హీరోగా చేస్తూనే మరో పక్క మ్యూజిక్ డైరెక్టర్ గా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. తెలుగులో జి వి ప్రకాష్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని మాత్రమే తెలుసు కానీ తమిళంలో అతను హీరోగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. అప్పుడప్పుడూ తమిళ్ డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ కూడా పలకరిస్తుంటాడు. రీసెంట్ గా రెబల్ అంటూ ఒక సినిమాతో వచ్చిన జి వి ప్రకాష్, ఈ ఏప్రిల్లో డియర్ అనే సినిమాతో తెలుగులో వస్తున్నాడు. రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ కాగా బాగా ఆకట్టుకుంటుంది. అయితే డియర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో గొడవపై క్లారిటీ ఇచ్చాడు జి వి ప్రకాష్.

ధనుష్ నేను మాట్లాడుకోలేదు..

అయితే రీసెంట్ గా డియర్ ట్రైలర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న జివి ప్రకాష్ ధనుష్ తో గొడవ పై క్లారిటీ ఇచ్చాడు. ధనుష్ తాను ఫిల్మ్ ఇండస్ట్రీ లో మంచి స్నేహితులమని మా మధ్య గొడవల కారణంగా దాదాపు ఆరేళ్లు మేమిద్దరం సరిగా మాట్లాడుకోలేదని చెప్పారు జి వి ప్రకాష్. ధనుష్ మంచి మనిషి. ఇష్టమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ధనుష్ తో క్రికెట్ ఆడటం ఇష్టమని అన్నాడు జి వి ప్రకాష్. కష్ట సుఖాల్లో తోడుండే వాడు ఫ్రెండ్. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అన్న తర్వాత మనస్పర్థలు సహజమే కదా. మళ్లీ కలవడం కూడా కామనే. అవసరమైనప్పుడు అర్థం చేసుకోవడమే నిజమైన స్నేహమని అంటున్నాడు జివి ప్రకాష్. ధనుష్ హీరోగా వచ్చిన మయక్కాం ఎన్నా, ఆడుకలం సినిమాలకు మొదట్లో పనిచేసిన జి వి ప్రకాష్ ఆ తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబోలో ఎన్ని సూపర్ హిట్స్ వచ్చాయో తెలిసిందే. ఆఫ్టర్ గ్యాప్ రీసెంట్ గా వచ్చిన వాతి, కెప్టెన్ మిల్లర్ (Captain Miller) సినిమాలకు మ్యూజిక్ అందించాడు. అయితే హీరో, మ్యూజిక్ డైరెక్టర్ ల మధ్య ఎంత మంచి రిలేషన్ ఉంటే వారి సినిమా మ్యూజిక్ అంత ఇంపాక్ట్ గా ఉంటుంది. అయితే ధనుష్ కి దూరంగా ఉన్న కొన్నాళ్లు అతని సినిమాలకు మ్యూజిక్ అందించని జివి ప్రకాష్ కెప్టెన్ మిల్లర్ కు అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

ఇద్దరూ బిజీ బిజీ..

ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గా హీరోగా జివి ప్రకాష్ రెండు పాత్రల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. తాజాగా డియర్ సినిమాతో హీరోగా ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయిన జివి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేతిలో అరడజను సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇక ధనుష్ కూడా కెప్టెన్ మిల్లర్ తర్వాత రాయన్ అంటూ తన స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగు లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో బాక్సాఫీస్ పై తన సత్తా చూపించేందుకు ధనుష్ సిద్ధమవుతున్నాడు. ఇక ధనుష్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమా మాత్రం హిట్ పక్కా అని రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ని బట్టి అంచనా వేస్తున్నారు ఆడియన్స్.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు