Payal Rajput : కొత్త ఏడాదిలో నాలుగు సినిమాలతో బ్యూటీ..

Payal Rajput : RX 100సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజపుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవడమే కాకుండా తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. మొదటి సినిమాలోనే హీరోయిన్ మాత్రమే అని కాకుండా నెగిటివ్ రోల్ లో చేయడమంటే అంత ఈజీ కాదు. కానీ పాయల్ చేసింది. పైగా ఈ సినిమాలో తన అందాల ఆరబోతతో సినిమా హిట్ కావడానికి మెయిన్ పిల్లర్ గా నిలిచింది. అయితే ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టేసరికి ఈ హీరోయిన్ కి వరుస ఆఫర్లు వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అలా రావాలని రూల్ ఏమి లేదుగా.. వెంటనే ఛాన్సులు ఏమి రాలేదు. కాం ఆఫర్లు అయితే వచ్చాయి గాని, అన్ని చిన్న సినిమాలు, పెద్దగా క్రేజ్ లేని ఆఫర్లే వచ్చాయి. ఆ సినిమాలేవీ కూడా అంతగా ఆడలేవు. ఇక ఆ తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా వంటి పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా చేసినా, అవి సెకండ్ లీడ్ రోల్సే. అందుకే పాయల్ కి వాటి వల్ల పెద్దగా లాభం లేకుండా పోయింది.

మంగళవారంతో మళ్ళీ ఫామ్..

అయితే పాయల్ రాజ్ పుత్(Payal Rajput) టాలీవుడ్ లో మళ్ళీ ఫామ్ లోకి రావడానికి సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కడానికి తన తొలి సినిమా డైరెక్టర్ అయిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే మళ్ళీ సినిమా చేసింది. ఈయన దర్శకత్వంలో చేసిన మంగళవారం సినిమాతో పాయల్ మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. సస్పెన్స్, హర్రర్ థ్రిల్లర్ గా తెరకెకెక్కిన ఈ సినిమాలో పాయల్ తన నటనతో ఆడియన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేసింది. చాలా మంది ఈ సినిమాలో పాయల్ చేసినటువంటి పాత్రని చేయడానికి ధైర్యం చేయరు. కానీ పాయల్ మాత్రం ఇలాంటి పాత్ర చేసి విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి కూడా ఆరు నెలలపైనే అయింది. కానీ పాయల్ రాజ్ పుత్ మళ్ళీ తెలుగు సినిమాలలో కనిపించలేదు. ఈ సినిమాతో ఫుల్ బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ ఎక్కడా పెద్దగా కనిపించలేదని మళ్ళీ సైలెంట్ అయిందా అనుకున్నారు. కానీ పాయల్ తన ప్లానింగ్ లో తాను ఉందని తెలుస్తుంది.

నాలుగు సినిమాలని లైన్లో పెట్టింది..

అయితే పాయల్ రాజపుత్ మంగళవారం తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్నా, మళ్ళి తన సినిమాల షూటింగ్ లో బిజీ అయింది. ఈసారి ఒకటి కాదు ఏకంగా నాలుగు సినిమాలని లైన్లో పెట్టింది. పైగా ఒక్క తెలుగు మాత్రమే అయితే వర్కౌట్ కాదని ఇతర భాషల సినిమాల్ని కూడా లైన్లో పెట్టింది. తెలుగులో ప్రస్తుతం కిరాతక అనే సినిమాలో నటిస్తున్న పాయల్, తమిళ్ లో గోల్ మాల్, ఏంజెల్ అనే సినిమాల్లో నటిస్తుంది. ఇదే గాక ఖుష్ ఖబరి అనే బెంగాలీ మూవీలో కూడా నటిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం పాయల్ ఎప్పటికప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది. పైగా తెలుగు ఆడియన్స్ కి ఎక్కువగా టచ్ లో ఉంటుందని తెలుస్తుంది. మరి మంగళవారం తర్వాత తెలుగు లో ఎలాంటి సినిమాలతో పలకరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు