Rashi Singh : ఒక్క హిట్టు కోసం పరితపిస్తుంది..

Rashi Singh : టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అలాగే హీరోయిన్ గా సక్సెస్ కొట్టి చక్రం తిప్పుదామని కోటి ఆశలతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో “రాశి సింగ్” ఒకరు. ఇంతవరకూ ఒక్క సక్సెస్ సినిమా కూడా లేని ఈ భామ ఇప్పటికీ కెరీర్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే సినిమాలు హిట్ కాకపోయినా తన గ్లామర్ షో తో మెప్పిస్తూ అవకాశాలు అందుకుంటుంది రాశి సింగ్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు తాను ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేశానని, అయితే చిన్నతనం నుండి సినిమాలు అంటే ఇష్టం కాబట్టి, హీరోయిన్ కావాలని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాను అని చెప్పింది. ఇక టాలీవుడ్ లో తన ఫేవరేట్ హీరో రామ్ చరణ్ అని చెప్తూ, లైఫ్ లో ఒక్కసారైనా రామ్ చరణ్ తో నటించాలని ఉందని పలు ఇంటర్వ్యూలలో చెప్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో మూడేళ్ళ కింద శశి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది.

ఈ ఇయర్ అయినా సక్సెస్ కొడుతుందా?

ఇక టాలీవుడ్ లో హీరోలకు అంత త్వరగా అవకాశాలు రాకపోయినా హీరోయిన్లకు మాత్రం ఒకటి రెండు ప్లాపులు పడ్డా మొదట్లో ఛాన్సులు వస్తుంటాయి. అలా రాశి సింగ్ పాపం పసివాడు, ప్రేమ్ కుమార్ వంటి సినిమాల్లో నటించగా, రీసెంట్ గా శివ కందుకూరి హీరోగా నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ముంబై భామ అయినా కూడా తెలుగులో వరుస అవకాశాలు వస్తుండడంతో హైదరాబాద్లోనే నివాసం ఏర్పరచుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకూ ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న భూతద్దం భాస్కర్ నారాయణ కూడా ప్లాప్ అయింది.

ప్రసన్నవదనంతో మరోసారి..

ఇక రాశి సింగ్(Rashi Singh) తాజాగా సుహాస్ హీరోగా నటిస్తున్న ప్రసన్నవదనంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. హీరో తన కళ్ళతో ఎక్కువగా దగ్గరున్న వాళ్ళని కూడా గుర్తు పట్టలేక పోయే విచిత్రమైన సమస్య తో వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. ఇక సుహాస్ రీసెంట్ గా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో కలిసి హ్యాట్రిక్ హిట్టు కొట్టగా, సుహాస్ లక్కీ హ్యాండ్ తో అయినా కలిసి రాశి సింగ్ ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తుంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్లలో కూడా తెగ సందడి చేస్తుంది. ఇక ప్రసన్నవదనం మే 3న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఏది ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టాకే హీరోయిన్ కి అసలు లైఫ్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ సినిమాతోనైనా రాశి సింగ్ మంచి హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కుతుందా లేదా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు