Saripodhaa Sanivaaram : డైరీలో అందరి లెక్కలు.. శనివారమే తెలుస్తాడా?

Saripodhaa Sanivaaram : టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు అందరి హీరోలకన్నా ప్లానింగ్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న లాంటి క్లాస్ మాస్ హిట్లతో దుమ్ములేపాడు. ఇక ఇప్పుడు టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మళ్ళీ హీరోగా వస్తున్నాడు. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికి అంతగా ఆడకపోయినా ఓటిటి లో అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ‘అంటే సుందరానికీ’ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ”సరిపోదా శనివారం”. ఈ సినిమాపై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి క్రేజీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్‌ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని మునుపెన్నడూ చూడని పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఇక టైటిల్ కు తగ్గట్టుగానే ప్రతీ శనివారం ఏదొక అప్డేట్ అందిస్తూ వస్తున్న మేకర్స్, ఈరోజు మళ్ళీ శనివారం ఓ స్పెషల్ పోస్టర్ తో వచ్చారు.

డైరీలో లెక్కలు రాసుకుంటున్నాడు..

ఇక నాని ‘సరిపోదా శనివారం‘(Saripodhaa Sanivaaram) సినిమాలో సూర్య అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా సూర్య తన గేమ్‌ను అలా ప్రారంభిస్తాడు అంటూ, మేకర్స్ తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను పంచుకున్నారు. శనివారాలను సూర్య స్కోర్లు సెటిల్ చెయ్యడం కోసమే ఉపయోగించుకుంటాడని టీజర్ లోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా వచ్చిన పోస్టర్ లో కూడా ఆ విషయం తెలియచేస్తున్నారు. అంతేకాదు మీ డైరీలలో మీరు ఎలాంటి ఆలోచనలను వ్రాస్తారో చెప్తే, ఇంట్రెస్టింగ్ గా రెస్పాండ్ అయిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ కూడా అందుతుందని మేకర్స్ ట్వీట్ చేసారు. ఇక ఈ పోస్టర్ లో నాని చాలా ఇంటెన్స్ గా చూస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ లో ”రాజు నా బైక్ ని గుద్ది సారీ చెప్పకుండా వెళ్లాడని, ముత్యాల రావు పాన్ పరాగ్ నములుతూ నారాయణ ప్రభ..” అంటూ ఒక పేపర్ మీద పెన్సిల్ తో ఏదో రాసుకోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ డైరీ వెనుక అసలు మ్యాటర్ ఏంటనేది ఖచ్చితంగా తెలీదు గానీ, పోస్టర్ ను బట్టి సూర్య ఆ వారంలో తనను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు నోట్ చేసుకొని, శనివారం నాడు వాళ్లందరి లెక్కలు తెలుస్తాడేమో అనిపిస్తోంది. ఎందుకంటే కథ నేపథ్యం కూడా అదే కదా..

అప్డేట్స్ తో అంచనాలు పీక్స్..

ఇక ‘సరిపోదా శనివారం’ మూవీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఫస్ట్ లుక్ లో నాని సంకెళ్లు తెంపుకుంటూ కోపోద్రేకాలు చూపించగా, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నాని పిడికిలి బిగించి, ఒక రౌడీ మెడ వంచి పట్టుకొని పవర్ ఫుల్ గా కనిపించాడు. ఇక టీజర్ లో కోపాన్ని క్రమబద్దంగా, పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే సత్తా చూపించే వ్యక్తిగా నాని ని పరిచయం చేసారు. ఇదంతా చూస్తుంటే నాని ఈసారి వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కే ఇంటెన్స్ యాక్షన్ & ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్.జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై డివివి దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి మురళి.జి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2024 ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు