Gopichand: గురి తప్పని రామబాణం

కొన్ని కాంబినేషన్ లు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అందులో దర్శకుడు శ్రీవాస్, హీరో గోపీచంద్ కాంబినేషన్ ఒకటి. గోపిచంద్ నటించిన లక్ష్యం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీవాస్ తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్ వంటి సినిమాలు శ్రీవాస్ కి హిట్ దర్శకుడిగా పేరును తీసుకొచ్చాయి.

దర్శకుడిగా శ్రీవాస్ ఎన్ని హిట్ సినిమాలను చేసిన లక్ష్యం, లౌక్యం సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ రెండు సినిమాలలో హీరో గోపిచంద్ కావడం, రెండు మంచి హిట్ టాక్ ను సాధించడం విశేషం. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం రామబాణం. ఇదివరకే దీనికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఆహా లో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు గోపిచంద్ కూడా హాజరయ్యాడు. ఆ షో లో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్న తరుణంలో దర్శకుడు శ్రీవాస్ తో హ్యాట్రిక్ సినిమాను చేస్తున్నట్టు గోపిచంద్ తెలిపాడు. నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ సినిమాను విష్ చేస్తూ రామబాణం టైటిల్ ను సూచించారు. లక్ష్యం, లౌక్యం, మాదిరిగానే రామబాణం అని పెట్టుకో సెంటిమెంట్ గా చివర సున్నా కూడా కలిసొస్తుంది అని చెప్పి దీవించారు.

- Advertisement -

కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు,ఒక సోషల్ ఇష్యూను టచ్ చేస్తూ ఈ సినిమా కథ సాగుతుంది అని సమాచారం వినిపిస్తుంది. ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన డింపుల్‌ హయాతీ హీరోయిన్‌ గా చేస్తోంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు