Nayanthara: టాలీవుడ్ పై ఫుల్ ఫోకస్..

లేడీ సూపర్ స్టార్ నయనతార కు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళంలో సినిమాతో కెరీర్ ప్రారంభించిన నయనతార, కొన్ని రోజుల్లోనే అన్ని సౌత్ భాషల్లో అవకాశాలను అందిపుచ్చుకుని, స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాగే లేడీ సూపర్ స్టార్ అనే పేరును కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అవుతుంది. బాలీవుడ్ బాద్ షా కింగ్ షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి విధితమే.

ఇలా భారీ సినిమాలు చేస్తూనే మంచి కన్సెప్ట్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇటీవల అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో, విఘ్నేష్ శివన్ నిర్మించిన చిత్రం కనెక్ట్. ఇది లేడీ ఓరియెంటెడ్ తో వచ్చిన సంగతి తెలిసిందే. ఇంటర్వెల్ లేకుండా వస్తున్న మొదటి చిత్రం అంటూ ప్రచారం చేసిన ఈ చిత్రం మంచి ఫలితాలను మాత్రం దక్కించుకోలేకపోయింది. అయినా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంపై నయనతార వెనక్కితగ్గలేదు.

తాజాగా నయనతార తెలుగులో ఒక ప్రముఖ డైరెక్టర్ తో లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ఇలాంటి సినిమా చేస్తే తెలుగు ఆడియన్స్ సులవుగా కనెక్ట్ అవుతుందని, అలాగే కోలీవుడ్ తనకు ఇప్పటికే ఉన్న క్రేజ్ తో తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని నయనతార భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఒక డైరెక్టర్ తో లేడీ ఓరియెంటెడ్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను వింటున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

అయితే ఆ డైరెక్టర్ ఎవరు? ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు? అలాగే దీనిలో నయనతారతో పాటు ఎలాంటి నటీనటులు ఉంటారు? అనే విషయాలను త్వరలోనే నయనతార ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు