Manchu Vishnu : ద‌స‌రాకి

టాలీవుడ్ హీరో, మా అధ్య‌క్షుడు మంచు విష్ణు ఈ మ‌ధ్య కాలంలో సినిమాలు త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. కొంత కాలం త‌రువాత న‌టిస్తున్న చిత్రం జిన్నా. ఈ చిత్రంలో విష్ణు స‌ర‌స‌న స‌న్నిలియోన్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టిస్తున్నారు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై హీరో విష్ణు స్వ‌యంగా నిర్మించారు. నూత‌న ద‌ర్శ‌కుడు సూర్య తెర‌కెక్కిస్తున్నారు. కామెడీ చిత్రాల ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర‌రెడ్డి క‌థ అందించ‌గా.. కోన వెంక‌ట్ స్క్రీన్ ప్లే అందించారు. తొలుత ఈ చిత్రాన్ని ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయాల‌నుకున్నారు.

అదే రోజు రెండు పెద్ద సినిమాలు గాడ్ ఫాద‌ర్‌, ది ఘోస్ట్ విడుద‌ల‌వుతుండ‌డంతో వాయిదా వేశారు. ఈ చిత్రంపై మొద‌టి నుంచి మంచి అంచ‌నాలే ఉన్నాయి. జిన్నా మూవీ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌తో పాటు విడుద‌లైన రెండు పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. ఇక సినిమాకి సంబంధించిన అఫీషియ‌ల్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని అక్టోబ‌ర్ 5న ద‌స‌రా పండుగ కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తాజాగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాను అక్టోబ‌ర్ 21న గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్నారు.

ఇక ఈ సినిమా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఈ చిత్రంపై క్యూరియాసిటీని పెంచుతూనే ఉంది. ఈ సినిమాని ర‌క‌ర‌కాలుగా ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తోంది. ఈ సినిమా నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలకి కూడా మంచి బ‌జ్‌ని క్రియేట్ చేశాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు