గోదావరి జిల్లాలో ఉన్న ఒక రెండు ఫ్యామిలీస్ మధ్య జరిగే కథ.రెండు కుటుంబాలు సరస్వతి, కొమర్ రాజు కుటుంబం వీరిద్దరూ వియ్యంకులు.అయితే అనూహ్యంగా కొత్తగా పెళ్ళయిన గీత-అజయ్‌లు దారుణంగా హత్యకి గురవ్వడంతో, వారి కుటుంబాలు బాధలో ఒక్కటౌతాయి. ఐతే హంతకుడిగా అనుమానింపబడుతున్న ఒక వ్యక్తి ఒక గాలివాన రోజు యాక్సిడెంట్ అయి వీళ్ళ ఇంటిదగ్గర పడివుంటాడు.తరువాత ఉదయం లేచే సరికి అతను చనిపోయి ఉంటాడు.అయితే ఆతనిని హత్య చేసింది వీరిలో ఒక్కరేనా..ఆ ఒక్కరు ఎవరు? కుటుంబ సభ్యులా, బయటి వ్యక్తులా అనే విషయాలను తెలుసు కోవాలంటే ఏప్రిల్ 14న వస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “గాలివాన” చూడాల్సిందే..
జీ 5’… ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది. ప్రతి నెలా ఒక కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ‘గాలివాన’ పేరుతో ఓ కొత్త వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్ సిరీస్‌గా నిర్మిస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్నో విజయ వంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్ కుమార్ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెరపై కూడా విజయాలు అందుకున్నారు. సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్ కుమార్, ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ వెబ్ సిరీస్‌తో బిబిసి రీజనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి అడుగు పెడుతోంది అని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, ‘జీ 5’ సంస్థలు తెలిపాయి. ‘తిమ్మరుసు’ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 14 న ZEE5 లో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్ లోని తాజ్ బంజారా లో ZEE5 యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.ఈ కార్యక్రమంలో
సీనియర్ నటి రాధిక గారు మాట్లాడుతూ..తెలుగు ప్రజలకు నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే ఎప్పటినుంచో నన్ను ఆదరిస్తున్నారు. వాళ్ళ ప్రేమ వెలకట్టలేనిది.శరత్ గారు నాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు తనను చిరంజీవి గారి దగ్గర చూసేదాన్ని .ఆయన నన్ను కలిసి వెబ్ సిరీస్ కథ చెప్పడం జరిగింది. నేను ఇప్పటివరకు ఏ భాషలోనూ వెబ్ సిరీస్ చేయలేదు. సినిమాలలో చాలా క్యారెక్టర్లు చేశాను ముందు కథ విందామని ఈ కథ వినడం జరిగింది.కథ నచ్చడంతో ఈ గాలివాన వెబ్ సిరీస్ చేస్తున్నాను. కథ అయితే అందంగా చాలా బాగా చెప్పారు. దీన్ని ఎలా తీస్తారు అనుకున్నాను.ఇక్కడ వచ్చిన తర్వాత ఈ టీం డెడికేషన్ చూసి రియల్ గా ఇంప్రెస్ అయ్యాను. మంచి ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి చాలా బాగా డీల్ చేశాడు.ఆలాగే నేను ఒక మంచి పాత్ర చేసిందుకు గర్వంగా ఉంది. ఇంతమంచి ప్రాజెక్టులో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వెబ్ సిరీస్ చేయడం వల్ల నాకు చాలా గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సాయికుమార్‌గారు కూడా అద్భుతంగా నటించాడు. తనతో చాలా సినిమాలలో నటించే అవకాశం వచ్చి మిస్సయినా.. “గాలివాన” లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది..ఇందులో నా కుతురుగా చాందిని చాలా చక్కగా నటించింది. చైతన్య, నందిని రాయ్, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్, అర్మాన్, శరణ్య ప్రదీప్ ఇలా అందరూ కూడా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు..మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ ఇలా అందరూ టెక్ నీషియన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేశారు. ZEE5, నార్త్ స్టార్ ఏంటర్ టైన్మెంట్స్, శరత్ గారు వండర్ఫుల్ సబ్జెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి మంచి సబ్జెక్ట్ రావడం వల్ల ZEE5 పై వీక్షకులకు రెస్పెక్ట్ పెరుగుతుంది. తెలుగులో వస్తున్న “గాలివాన” వెబ్ సిరీస్ ఒక ల్యాండ్ మార్క్ సిరీస్ అవుతుంది. జీ5, బిబిసి కొలాబ్రేషన్‌లో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘గాలివాన’ వెబ్ సిరీస్ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ…అందరూ డైలాగ్ కింగ్ సాయికుమార్ అంటారు. కానీ ఈ స్వరం నాకు నాన్నగారిచ్చారు. సంస్కారం మా అమ్మగారు ఇచ్చింది. అనుగ్రహం ఆ భగవంతుడిది. ఆశీర్వాదం, అభిమానం మీ అందరిదీ. అలా పోలీస్ స్టోరీ ద్వారా నా జర్నే స్టార్ట్ అయ్యింది.మొదట కన్నడ లో విడుదలైన పోలీస్ స్టోరీ సినిమా ద్వారా అక్కడి ప్రజలు నన్ను హీరోని చేశారు. అక్కడి నుంచి ఎన్నో అద్భుతమైన వేషాలు వేయడం జరిగింది.సావిత్రి గారి దగ్గరనుంచి అందరితో వర్క్ చేశాను కానీ.. ఒక రాధికా గారితో మాత్రం మిస్ అయింది.మా నాన్న గారు రాధిక గారు నటించిన న్యాయం కావాలి సినిమాలో జడ్జిగా యాక్ట్ చేశాడు.చివరికి ఇప్పుడు రాధిక గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఓటీటీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. శరణ్ వంటి యంగ్ అండ్ టాలెంటెడ్ టీంతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు మంచి ఎమోషన్స్‌తో పాటు ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్ అండ్ థ్రిల్‌ను కలిగిస్తుంది. వండర్ఫుల్ సబ్జెక్టులో రాధిక గారితో పాటు ఇంతమంచి టీం తో పని చేసే ఆవకాశం ఇచ్చిన శరత్ గారికి ZEE5 వారికి ధన్యవాదాలు ఈ నెల 14న వస్తున్నాం గాలివాన మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసే ఈ గాలివాన ను సక్సెస్ చేయాలని కోరుతున్నాను అన్నారు.
నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ…సరస్వతిగా రాధిక గారు,కోమర్ రాజుగా సాయికుమార్ అద్భుతంగా నటించారుZEE5, బిబిసిలతో కొలాబ్రేట్ అయ్యి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మా నార్త్ స్టార్ ప్రొడక్షన్‌కు వెరీ స్పెషల్. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంత మంది ఆర్టిస్ట్ లను డీల్ చేయడం చాలా కష్టం. దర్శకుడు శరణ్ కథకు ఏం కావాలో వారి క్యారెక్టర్స్ ను, ఎమోషన్స్ తో ఎవరి క్యారెక్టర్ వాళ్లకి అద్భుతంగా వచ్చేలా ఆర్టిస్టుల దగ్గర నుంచి చాలా చక్కగా రాబట్టుకున్నాడు. నా భార్య కీర్తి ప్రాజెక్టు హెడ్ గా కో ప్రొడ్యూసర్ గా ఉంటూ ఈ వెబ్ సిరీస్ ను కోఆర్డినేట్ చేసింది. నటీనటులు,టెక్నీషియన్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు.ZEE5 వారు చాలా ఈ సిరీస్ ను చాలా డిఫరెంట్ గా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ నెల 14 న వీక్షకుల ముందుకు వస్తున్న మా “గాలివాన” వెబ్ సిరీస్ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
జీ5 తెలుగు ఒరిజినల్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ పద్మా కస్తూరి రంగన్ మాట్లాడుతూ…మా ZEE5లో ప్రతినెలా ఒక హిట్ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తూ వీక్షకుల మనసును దోచుకుంటుంది ZEE5 ఒరిజినల్. ఓటీటీ ఇండస్ట్రీ సినిమాతో సమానంగా ఎదుగుతుందని శరత్‌మరార్ ముందే గ్రహించి వెబ్‌సిరీస్‌లను ఆయన స్టార్ట్ చేశారు. BBC అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్.ఆ బ్రాండ్ తో ZEE5,నార్త్ స్టార్ శరత్ లతో కలిసి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఇది గ్రేట్ స్టోరీ.ఇప్పటివరకు చాలా కథలు విన్నాను. కానీ ఇందులో ఎమోషన్ ,సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ చాలా డీఫ్రెంట్ స్టోరీ ఇది మాకు మెమరబుల్ వెబ్ సిరీస్ గా నిలిచిపోతుంది. శరత్ మరార్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు.వారికి స్పెషల్ థాంక్స్.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 14న వస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “గాలివాన” వెబ్ సిరీస్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
దర్శకుడు శరణ్ గోపిశెట్టి మాట్లాడుతూ…నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నాకు హోమ్ బ్యానర్ లాంటిది.ఇందులో ఇంతకు ముందు నార్త్‌స్టార్‌లోనే ‘ది గ్రిల్’ అనే వెబ్ సిరీస్ చేశాను. నా సినిమా “తిమ్మరుసు” రిలీజ్ అయిన తర్వాత ఇంకొక సినిమా చేయడానికి ప్లాన్ చేసే టైంలో శరత్ గారు కాల్ చేసి ఇంకో వెబ్ సిరీస్ చేద్దాము ఆఫీస్ కు రమ్మన్నారు. నేను మూవీ చేస్తున్నాను వెబ్ సిరీస్ చేయలేను అని చెప్పడానికి వెళ్లిన నాకు శరత్ గారు ఫోన్ చేసి సీనియర్ నటి రాధిక గారు, సాయి కుమార్ గార్లతో వెబ్ సిరీస్ చేద్దామన్నారు.రాధిక మేడం, సాయి కుమార్ లాంటి పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం అదృష్టంగా భావించాను.
మిక్స్‌డ్ ఎమోషన్స్‌తో ఉండే క్రైం థ్రిల్లర్. ఇలాంటివి దర్శకుడికి నిజంగా ఛాలెంజ్ అని చెప్పాలి. రాధికా గారు, సాయి కుమార్ గారు అద్భుతంగా నటించారు వీరి ద్వారా నేను చాలా నేర్చుకున్నాను వీరిద్దరినీ డైరెక్షన్ చేసినందుకు నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను శరత్ గారు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. సుజాత సిద్దార్థ గారు చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు,హరి గౌర గారు నాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.ఎడిటర్ సంతోష్ కూడా చాలా చక్కని ఎడిటింగ్ చేశాడు.ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్,నటీనటులు అందరూ చాలా హార్డ్ వర్క్ చేయడంతో ఈ “గాలివాన” వెబ్ సిరీస్ చాలా బాగా వచ్చింది.ZEE5 పద్మ గారు, రాధా గారు, పూర్ణ ,చక్రి ,అందరు కూడా నేను ఏమడిగినా నాకు సపోర్ట్ చేశారు .ఏప్రిల్ 14 ఈజీ ఫైవ్ లో ‘గాలివాన’ వెబ్ సిరీస్ లాంచ్ అవుతున్నందుకు మొదటగా ZEE5 వారికి థాంక్స్ చెప్పుకోవాలి
నటుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ…సరస్వతి (రాధిక)మేడం కు కొడుకుగా నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.సీనియర్ నటులతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఓటిటి మార్కెట్ లో ఇదే బెస్ట్ త్రిల్లర్ వెబ్ సిరీస్ అవుతుంది. మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లో చేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటి చాందిని మాట్లాడుతూ…శరత్ గారితో వర్క్ చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది.ఇప్పడు ఆ అవకాశం లభించింది.నాకు చిన్నప్పటి నుండి క్రైమ్, థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి ఇష్టమైన సబ్జెక్ట్‌లో రాధిక మేడం, సాయికుమార్ గార్లతో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
నటుడు తాగుబోతు రమేష్ మాట్లాడుతూ…లాక్ డౌన్ లో నాకు ఈ కథ చెప్పినప్పుడు .ప్రేక్షకులు సినిమాలు చూస్తారు కానీ వెబ్ సిరీస్ ఎవరు చూస్తారు అనుకున్నాను.ఆ తరువాత ఒక వెబ్ సిరీస్ ను ఇంత అద్భుతంగా తీస్తారని అప్పడు తెలుసు కున్నాను.ఈ “గాలివాన” నా లైఫ్ లో స్పెషల్ ఈ సిరీస్ చేస్తున్న టైంలోనే నాకు కూతురు పుట్టింది. ఇందులో నేను పోలీసు పాత్ర చేస్తున్నాను.”గాలివాన” లో అవకాశాన్ని, నా కూతురును, ఈ క్యారెక్టర్ ను లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పటి నుంచి నన్ను శరత్ మరార్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు.వారికి నేను ఏప్పటికే రుణపడి ఉంటాను. ఇప్పటి వరకూ నాకు తాగుబోతు ఇమేజ్ ఉన్న నన్ను సీనియర్ ఆర్టిస్ట్ లతో చేసే అవకాశం కల్పించారు. ఇంతమంది నటీనటులతో చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలు నా ధన్యవాదాలు అన్నారు.
రైటర్ చంద్ర పెమ్మరాజు మాట్లాడుతూ .శరత్ మరార్ లేకపోతే ఈ “గాలివాన” లేదు. రాధికా మేడమ్ సినిమాలు రాధాకళ్యాణం, మూడు ముళ్ళు, అభిలాష నుంచి నేను ఆమెకు బిగ్ ఫ్యాన్ అయిపోయాను. ఒక తెలుగు నేటివిటికి ఈ కథ ఎలా ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఒక చోట జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసుకుని రాసిన కథే “గాలివాన” .ఇందులో సరస్వతి గా రాధికా శరత్ కుమార్ నటిస్తుంది, కొమర్ రాజు గా సాయి కుమార్ గారు నటిస్తున్నారు. చెప్పడానికి మర్డర్ మిస్టరీ అయినా ఇందులో నైతిక విలువలు ఏంటి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఏ గాలివాన ద్వారా తెలియ జేస్తుంది. ఇందులో ఏడు ఎపిసోడ్స్ ఉంటాయి.ప్రతి ఎపిసోడ్ కూడా క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది అన్నారు.
ఎడిటర్ సంతోష్ కామిరెడ్డి మాట్లాడుతూ.. శరత్ గారు, దర్శకుడు, ZEE5 వారు నాకు చాలా బాగా సహకరించారు.
ప్రతి దానికీ ఎడిటర్ ఫస్ట్ ఆడియన్. ఫస్ట్ ఆడియన్ గా చెప్తున్నాను తెలుగు వెబ్ సిరీస్ కేటగిరిలో స్టాండ్ ఔట్ గా “గాలివాన” నిలుస్తుంది.అందరూ ఈజీగా కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఫ్యామిలీ ఇది ఎమోషనల్ ఫ్యామిలీని బేస్ చేసుకొని తీసిన “గాలివాన” అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ గౌరవ హరి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “గాలివాన’ వెబ్ సిరీస్ కు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన ZEE5 వారికి,శరత్ గారికి ధన్యవాదాలు అన్నారు.
డిఓపి సుజాత సిద్ధార్థ మాట్లాడుతూ. ఏడు ఎపిసోడ్లు గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ అద్బుతంగా ఉంటుంది అన్నారు.
శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ.. నటి రాధిక మేడమ్,సాయి కుమార్ గారితో పని చేయడం అదృష్టం గా భావిస్తున్నాను.ఈ గాలివాన లో నటించడం ద్వారా వాళ్ల నుంచి నేను పేషెన్స్, పర్ఫామెన్స్ నేర్చుకున్నాను అన్నారు.
అర్మాన్ మాట్లాడుతూ.. ఇందులో నాకు శ్రీకాంత్ పాత్ర ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సీనియర్ నటులతో వర్క్ చేసిన “గాలివాన” నాకు చాలా నేర్పింది అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో అశ్రిత వేముగంటి, శరణ్య ప్రదీప్ ఈ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 14 న ZEE5 లో ప్రసారమవుతున్న “గాలివాన” వెబ్ సిరీస్ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.
నటీనటులు : సాయికుమార్, రాధిక శరత్‌కుమార్, నందిని రాయ్, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్, అర్మాన్, శరణ్య ప్రదీప్, ఆర్. రమేష్, శ్రీలక్ష్మి, నిఖిత, చరిత్, సతీష్ సారిపల్లి, నానాజీ, నవీన్, సూర్య శ్రీనివాస్, జయచంద్ర తదితరులు.
సాంకేతిక నిపుణులు : దర్శకత్వం : శరణ్ కొప్పిశెట్టి, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ : సుజాత సిద్దార్థ, ప్రొడ్యూసర్ : శరత్ మరార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నీలిమా మరార్, ప్రాజెక్ట్ హెడ్ : కీర్తి మన్నె, క్రియేటివ్ హెడ్ : ఎ. సాయి సంతోష్, కాస్ట్యూమ్ డిజైనర్ : రేఖా బొగ్గరపు, ఆర్ట్ డైరెక్టర్ : ప్రణయ్ నయని, ఎడిటర్ : సంతోష్ నాయుడు, సంగీతం : శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ కంట్రోలర్ : వైశాక్ నాయర్, ప్రొడక్షన్ మేనేజర్ : రవి మూల్పూరి, ప్రొడక్షన్ మేనేజర్ అసిస్టెంట్ : రామ్ ప్రసాద్, కో`డైరెక్టర్ : కె. ప్రభాకర్, చీఫ్ ఏడీ: హనుమంత్ శ్రీనివాసరావు, పీఆర్వో : సురేందర్ నాయుడు`ఫణి.