PK: “హరి హర వీరమల్లు” సెట్స్ లో అగ్ని ప్రమాదం

పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు సెట్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో అర్థరాత్రి సమయంలో జరిగిందని సమాచారం. వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికి షూటింగ్ జరుపుకుంటుంది. బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తూనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను మెల్లిగా పూర్తి చేస్తున్నాడు. భారీ పీరియాడికల్ డ్రామా గా ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో సినిమా కోసం భారీ సెట్స్ వేయాల్సి వస్తుంది.

అలా రీసెంట్ గా బౌరంపేట లో ఈ సినిమాకి సంబంధించిన సెట్ వేయడం జరిగింది. ఈ సెట్ ఆదివారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదానికి గురి అయింది. అయితే గత రెండురోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని చిత్ర యూనిట్ తెలిపారు. అయితే ఈ సెట్ ని మాత్రం మళ్ళీ రిపేర్ చేసి సెట్ చేసే పనిలో ఉన్నారు మూవీ మేకర్స్. ఫలితంగా చిత్ర షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది.

అయితే షూటింగ్ లో ప్రమాదాలు జరగడం కొత్తేమి కాదు, గతంలో జల్సా షూటింగ్ సమయంలో ఇలాగే ప్రమాదం జరగ్గా పవన్ కళ్యాణ్ స్వయంగా గాయపడ్డ వ్యక్తిని ఎత్తుకుని అంబులెన్సు లో హాస్పిటల్ కి పంపించాడు. ఇక రీసెంట్ సైరా సెట్స్ లో, అలాగే శంకర్ ఇండియన్ 2 సెట్స్ లో కూడా ఇలా అగ్ని ప్రమాదాలు జరిగాయి.

- Advertisement -

ఇక హరిహరవీరమల్లు షూటింగ్ ఇంకా ముప్పై శాతం వరకు పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఈ షూట్ పూర్తయ్యే సరికి బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ లు విడుదల అయిపోవడం ఖాయం. అయితే సినిమా నిడివి ఎక్కువ కావడంతో రెండు భాగాలుగా తీసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు