Jacqueline Fernandez : బాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో అగ్ని ప్రమాదం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ మరోసారి అగ్ని ప్రమాదం కారణంగా వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ ఆ అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగింది? అనే వివరాల్లోకి వెళితే…

ముంబైలోని అపార్ట్ మెంట్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న పాలీ హిల్ లోని నవరోజ్ హిల్ సొసైటీ అపార్ట్మెంట్ భవనంలో బుధవారం మంటలు చెలరేగాయి. మార్చ్ 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడకపోవడం ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం. అయితే సమాచారం అందిన వెంటనే మూడు జంబో ట్యాంకర్లు, నాలుగు అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ బిల్డింగ్ లో మొత్తం 17 అంతస్తులు ఉండగా, 14వ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్ లోని వంట గదిలో మంటలు అంటుకున్నాయి. బుధవారం రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఘటన చోటు చేసుకోగా, వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇక ఈ బిల్డింగ్ లోనే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 15వ అంతస్తులో నివసిస్తున్నారు.

2023లో ఇల్లు కొన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్…
ఈ నవరోజ్ హిల్స్ సొసైటీ అపార్ట్మెంట్ భవనంలో చాలామంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు నివసిస్తుండడం విశేషం. ఇక కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్, అలియా భట్, రణబీర్ కపూర్ తో సహా పలువురు బాలీవుడ్ బడా స్టార్స్ ఇక్కడ పక్క పక్కనే నివసిస్తున్నారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి స్టార్స్ కూడా పక్కనే ఉండడంతో ఇదొక సంపన్నుల ప్రాంతంగా ముంబైలో చాలా పాపులర్ అయ్యింది. చాలామంది సెలబ్రిటీలు ఆ ప్రాంతంలో ఇల్లు కొనడానికి ఇష్టపడతారు. అందుకోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికి అయినా వెనకాడరు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2023 జూలైలో నవరోజ్ హిల్స్ సొసైటీ అపార్ట్మెంట్ భవనంలో ఒక ఫ్లాట్ కొనుక్కుంది. తాను కొన్న ఆ 5 బిహెచ్కె ఇంటిని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది. ఇక త్వరలోనే రణవీర్ సింగ్ దీపికా పదుకొనే కూడా ఇక్కడే ఇల్లుకొనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

జాక్వెలిన్ సినిమాల విషయానికి వస్తే…
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా సందడి చేసింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. సల్మాన్ ఖాన్ సరసన కిక్, రేస్, అక్షయ్ కుమార్ తో కలిసి రామ్ సేతు, హౌస్ ఫుల్ 3, ప్రభాస్ తో సాహో వంటి సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది జాక్వెలిన్. రీసెంట్ గా ఈ బ్యూటీ విక్రాంత్ రోనా అనే మూవీలో స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆమె ఓ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో నటిస్తోంది. ఆ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతుండగా, తను సెట్ లో ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. కాగా 200 కోట్ల భారీ మోసం కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ తో ఉన్న సంబంధాల వల్ల ఇటీవల కాలంలో జాక్వలిన్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు