Dhanush : “సార్” వచ్చేశాడు !

తమిళ స్టార్ హీరో ధనుష్ వరస మూవీస్ తో దూసుకుపోతున్నాడు. ఇక లేటెస్ట్ గా తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో డైరెక్ట్ గా నటిస్తున్న తొలి చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటుంది. తమిళంలో ఈ సినిమాకి ‘వాత్తి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటుంది.

ఇందులో ధనుష్ స్కూల్ టీచర్ గా నటించనుండడం విశేషం. సంయుక్త మీనన్ కథానాయకగా నటిస్తుండగా, డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి పనులు ఫినిష్ అవుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ‘సార్’ చిత్రం నుంచి వరుసగా అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు మేకర్స్.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఓ లైబ్రరీలో కూర్చొని తన పని తాను చాలా శ్రద్ధగా చేసుకుంటూ ధనుష్ మనకు కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూస్తుంటే… మూవీ టైటిల్ కు తగ్గట్టుగానే ఇందులో ఓ లెక్చరర్ ( or టీచర్ ) పాత్రలో ధనుష్ కనిపించనున్నట్లు మనకు అనిపిస్తుంది. ఓ మధ్య తరగతి లెక్చరర్ ఎలా ఉంటాడో అచ్చం ధనుష్ ఈ ఫస్ట్ లుక్ లో అలాగే కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ ను రేపు సాయంత్రం 6 గంటల సమయంలో విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించింది చిత్ర బృందం. ఈ వరుస అప్డేట్స్ తో…ధనుష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు