Dhamaka: ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కమర్షియల్ మేకర్. త్రినాధరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరెట్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పథకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిబోట్లా సహనిర్మాత. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్డేట్ లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 15న సాయంత్రం 6:45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్ గా కట్ చేశారని, అది ఆడియన్స్ కు బాగా నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు