Dasara: వాలెంటైన్స్ డే స్పెషల్ సాంగ్

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రతి ఒక సినిమాకి తన లుక్ ని మారుస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నారు. డిఫరెంట్ స్టోరీ లైన్స్ తో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ను షాక్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాని నుంచి మూడు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో నాని జతకట్టనున్నాడు. హిట్ 3 కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా సాగుతున్నాయి. దీంతో పాటు డైరెక్టర్ శౌర్యువ్ తో NANI30 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో గ్రాండ్ గా జరిగాయి. ఇదిలా ఉండగా నాని నటించిన దసరా సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

నానికి జోడిగా “మహానటి” కీర్తి సురేష్ నటించిన చిత్రం “దసరా”. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం నాని కొత్త లుక్ అని చెప్పవొచ్చు. ఇప్పటికే రిలీజ్ అయిన “ధూమ్ ధామ్ ధోస్థాన్” అనే మాస్ సాంగ్ ఫ్యాన్స్ తో డాన్స్ లు చేపిస్తుంది. ఇక మరో క్రేజీ అప్డేట్ ను చెప్పారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్డేట్ ఇచ్చారు.

- Advertisement -

ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ కు సంబందించిన అప్డేట్ ను రేపు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం Filmify ను ఫాలో అవండి.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు