Dasara: ఎత్తిన సీసా దించకుండా తాగిన కీర్తి సురేష్

దసరా చిత్రం ప్రమోషన్స్ ను నేచులర్ స్టార్ నానితో పాటు చిత్ర యూనిట్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేసిన టీం, ఇప్పుడు సౌత్ పై ఫోకస్ పెట్టి ప్రమోషన్స్ చేస్తున్నారు. హిందీ ప్రేక్షకులను మెప్పించడానికి నానితో పాటు చిత్ర యూనిట్ మొత్తం ముంబైకి మకాం మార్చేసింది. అక్కడే ఉండి ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. నాని ఫేస్ బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడంతో, రానా దగ్గుబాటి సాయాన్ని తీసుకుంటున్నారు.

రానా టాలీవుడ్ హీరో అయినప్పటికీ బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీన్ని దసరా టీం ఉపయోగించుకోవాలని చూస్తోంది. అందుకే ప్రమోషన్స్ లో రానా సాయం తీసుకుంటున్నారు. ఇదీలా ఉండగా, ప్రస్తుతం నాని, రానా, కీర్తి సురేష్ ముంబై వీధుల్లో దసరా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ముంబైలో ఒక చోట ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో కీర్తి సురేష్ చేసిన పని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

దసరా మూవీలో నాని ఎక్కువగా మద్యం తాగుతాడన్న విషయం తెలిసిందే. దాన్నే ప్రమోషన్స్ లో వాడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలో ఒక కల్లు దుకాణంలో నాని.. దసరా సినిమాలోని స్టైల్ ను ఫాలో అవుతూ కల్లు తాగాడు. రానా కూడా నాని ని ఫాలో అవుతూ కల్లు తాగాడు. పక్కనే ఉన్న కీర్తి సురేష్.. తానేం తక్కువ కాదంటూ ఎత్తిన సీస దింపకుండా, కల్లు మొత్తం తాగేసింది. దీంతో నాని, రానాతో పాటు మూవీ టీం కూడా షాక్ లోకి వెళ్లిపోయారు. దాని నుంచి తెరుకున్న తర్వాత, భలే తాగావు అంటూ ఎంకరేజ్ చేశారు. అక్కడున్న అభిమానులు కూడా కీర్తి సురేష్ చేసిన పనికి అరుపులతో ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

కాగా, దసరా పాన్ ఇండియా రేంజ్ లో మార్చి 30న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు