Dasara: 36 సెన్సార్ కట్స్… ఇక సినిమాలో ఏం ఉంది

ప్రస్తుతం అందరి చూపులు దసరా సినిమాపైనే ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ఈ సినిమాతో మార్చి 30న ఏదో అద్భుతం క్రియేట్ చేసేలా ఉందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతున్నారు. దసరా చిత్ర యూనిట్ కూడా అదే రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే సినిమా కాబట్టి ప్రమోషన్స్ ను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ ను లక్నోలో విడుదల చేసి బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేశారు.

అలాగే ఇటీవల ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ లో కూడా నాని కనిపించాడు. ఒక ముంబైలో కీర్తి సురేష్ కల్లు తాగిన వీడియో వైరల్ అయింది. అది కూడా దసరా ప్రమోషన్స్ కు బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఇంతలా ప్రమోషన్స్ చేసుకుంటున్న దసరా చిత్రానికి షాక్ తగిలింది. సినిమాకు ఇటీవల సెన్సార్ రిపోర్ట్ వచ్చిన సంగతి తెలిసిందే. U/A సర్టిఫికేట్ వచ్చింది. కానీ, దసరా కు 36 కట్స్ వేశారట. మొదటి భాగంలో 20 కట్స్, రెండో భాగంలో 16 కట్స్ చెప్పారట.

సినిమాలో అసభ్యకరంగా ఉన్న చోట సబ్ టైటిల్స్ తో సహా మ్యూట్ పెట్టాలని, డిస్ క్లైమర్ లో వచ్చే ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ వచ్చే దాన్ని ఫాంట్ సైజ్ పెంచాలని చెప్పారట. వైలైన్స్ అధికంగా ఉన్న చోట సీజీ వేసి కవర్ చేయాలని సూచించిందని సమాచారం. అలాగే ధూమ్ ధామ్ దోస్తాన్ పాటలో వచ్చిన బూతు పదాలపై సెన్సార్ బోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసిందట. వాటిని తొలగించాలని కండీషన్ పెట్టిందని తెలుస్తోంది.

- Advertisement -

అయితే దసరా సినిమాను తెలంగాణ నెగిటివిటీ తగినట్టుగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. ఈ ప్రాంత ప్రజలు ఎలా ఉంటారో, ఎలా మాట్లాడుతారో అలానే ఈ సినిమాలో చూపించాడు. ఈ క్రమంలో కొన్ని చోట్ల బూతు పదాలు వచ్చాయి. అవి సినిమాకు అందంగానే ఉంటాయి. కానీ, ఇప్పుడు వాటికి సెన్సార్ కట్స్ చెప్పడంతో దసరా మూవీ సహజత్వానికి దూరంగా ఉంటుందని దసరా చిత్రం అభిమానులు అంటున్నారు. కాగా, దీనిపై ఇంకా చిత్ర యూనిట్ స్పందించలేదు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు