Ponniyin Selvan : చోళా చోళా పాట

లెజండరీ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం పొన్నియన్ సెల్వన్-1. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలు వస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌ పై మ‌ణిర‌త్నం నిర్మిస్తున్నారు. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా, శోభితా ధూళపాళ, ప్రభు, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

దీనికి తోడు ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘పొంగే నది..’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా చిత్ర యూనిట్ రెండో సింగిల్ ను విడుదల చేశారు. ‘చోళ చోళ’ అనే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ అందించగా, అనంత శ్రీరామ్‌ లిరిక్స్ అందించారు. అలాగే మనో, అనురాగ్‌ కులకర్ణి కలిసి ఆలపించారు.

“పెద పెద పులి ఎచ్చోటరా.. కూర్చోదురా.. చోళా చోళా” అంటూ సాగిన ఈ పాట ఆసక్తి కరంగా ఉంది. సాంగ్ మొత్తం చూస్తే మణిరత్నం టెస్ట్ కనిపిస్తుంది. అలాగే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ప్రతిభ కూడా ఈ పాటలో కనిపిస్తుంది. మొదటి పాట ‘పొంగే నది..’ దాని కంటే ఈ ‘చోళ చోళ’ పాట ఆసక్తి కరంగా ఉంది. అయితే, ఈ పాటను వింటున్న సమయంలో డబ్బింగ్ పాటను విన్న ఫీలింగ్ వస్తుంది. అయినా, మరి ఇబ్బందికరంగా కాకుండా ఆసక్తికరంగానే ఉంది. అయితే తమిళ ప్రేక్షకులకు మాత్రం ఈ పాట సూపర్ గా నచ్చుతుంది. ఈ పాటతో సినిమాపై అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు