Chandramukhi: ఎవరు ?

మలయాళం సూపర్ స్టార్ సురేష్ గోపి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం మణిచిత్రతాజు. ప్రస్తుత మలయాళీ ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శోభన హీరోయిన్ గా నటించింది. మణిచిత్రతాజు చిత్రం 1993లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇదే సినిమాను తమిళంలో రజినీకాంత్ హీరోగా చంద్రముఖి అనే టైటిల్తో తెరకెక్కించడం జరిగింది. చంద్రముఖి సినిమా లో ఈశ్వర్ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు రజినీకాంత్. చంద్రముఖి సినిమాలో జ్యోతిక, నయనతార కథానాయికలుగా నటించారు. 2005వ సంవత్సరంలో విడుదలైన చంద్రముఖి రికార్డులను సైతం సృష్టించింది. ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా ఇక్కడ మంచి విజయాన్ని అందుకుంది.

2005 లో రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న విషయం విదితమే. చంద్రముఖి -2 లో రజినీకాంత్ ప్లేస్ లో రాఘవ లారెన్స్ ను తీసుకున్నాడు దర్శకుడు పి.వాసు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ నెల 15వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం మైసూర్ లో సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

చంద్రముఖి చిత్రంలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. లక్ష్మి మీనన్ ,మంజిమా మోహన్ , మహిమ నంబియార్, సృష్టి దాంగే తో పాటు సుభిక్ష కృష్ణన్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురు హీరోయిన్లలో అసలు చంద్రముఖి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. చంద్రముఖి సినిమాలో ఆ పాత్రకు జ్యోతిక పూర్తి న్యాయం చేసింది. ఈసారి ఆ రేంజ్ లో నటించగల నాయిక ఎవరు అనేది ఆసక్తి కరంగా మారింది. చంద్రముఖి ఎవరు అని ముందే తెలిసిపోతే ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చెయ్యలేరు అనే ఉద్దేశ్యంతో మేకర్స్ మాత్రం ఆ విషయాన్ని సీక్రేట్ గానే ఉంచుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు