Virupaksha: టాప్ టెన్ లిస్ట్ లో అన్నదమ్ములు..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన సినిమా విరూపాక్ష. విడుదలకు ముందే పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని తేజ్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ దిశగా అడుగులేస్తోంది. తొలివారంలోనే బ్రేకివెన్ సాధించిన ఈ సినిమా రెండో వారంలో కూడా అదే ఊపు కొనసాగిస్తోంది. ఇటీవల విడుదలైన ‘ఏజెంట్’, ‘పీఎస్ 2’ సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించకపోవటం వల్ల విరూపాక్ష కలెక్షన్లపై పెద్దగా ప్రభావం పడలేదు. మూఢనమ్మకాలపై మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగటంతో ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

సినిమా విడుదలై 10రోజులు అవుతున్నా విరూపాక్ష జోరు తగ్గటం లేదు. 10వ రోజు 2.38కోట్ల షేర్ సాధించి మీడియం రేంజ్ సినిమాల్లో ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఉప్పెన సినిమాతో డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఈ లిస్ట్ లో టాప్ 1 స్థానంలో నిలిచాడు. మీడియం రేంజ్ సినిమాల్లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాల లిస్ట్ లో మెగమేనల్లుళ్ళు ఇద్దరు తొలి రెండు స్థానాల్లో నిలవటం విశేషం.

ఇప్పటికే సుమారు 70 కోట్ల గ్రాస్ సాధించిన విరూపాక్ష 100కోట్ల మైలురాయి దిశగా అడుగులేస్తోంది. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తేజ్ 100కోట్ల మార్క్ అందుకోవటం పెద్ద కష్టమేమీ కాదని అనిపిస్తుంది. తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా తోలి ప్రయత్నంలోనే ఈ మార్క్ అందుకోగా, ఇటీవలే యాక్సిడెంట్ నుండి కోలుకున్న తేజ్ విరూపాక్ష సినిమాతో ఈ మైల్ స్టోన్ అందుకోబోతున్నాడు. మే 5న హిందీ సహా ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కార్తికేయ2 తరహాలో అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు