BRAHMĀSTRA: దేవ దేవా టీజర్ అవుట్

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోని ‘దేవ దేవా’ పాట టీజర్‌ను విడుదల చేశారు.ఫుల్ సాంగ్ ను ఆగస్టు 8న విడుదల చేయనున్నారు. బ్రహ్మాస్త్ర లో అలియా భట్ ‘ఇషా’ పాత్రలో కథానాయికగా నటిస్తోంది. బ్రహ్మాస్త్ర చిత్రానికి పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు ట్రైలర్‌కి చిరంజీవి వాయిస్‌ని అందించారు.

హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది ఈ చిత్రం విడుదల కానుంది. ‘బ్రహ్మాస్త్ర’లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు, టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విభజించారు, మొదటి భాగానికి బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

https://youtu.be/xEdxnyF4iQs

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు