Liger : రొమాంటిక్ గా ఆఫట్ సాంగ్ ప్రోమో

టాలీవుడ్ లో మోస్ట్ అవెటెడ్ సినిమా లైగర్. పూరీ ఫ్యాన్స్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రెండేళ్ల నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అన్ని పనులు ముగించుకున్న లైగర్, ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ దేశ వ్యాప్తంగా సంచలనాలను నమోదు చేసింది. టాలీవుడ్, నుంచి బాలీవుడ్ వరకు ప్రేక్షకులు ఈ ట్రైలర్ ను ఆదరించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తో పాటు అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ కూడా కనిపిస్తున్నారు. దీంతో సినిమాపై ఇంటర్నెషనల్ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పాటలు వచ్చాయి. ప్రతి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మరో పాట విడుదలకు రెడీ అవుతుంది. ఆఫట్ అనే సాంగ్ రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల కాబోతుందని మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ తో పాటు ప్రోమోను కూడా విడుదల చేశారు.

ఆఫట్ సాంగ్ ప్రోమో గానీ, పోస్టర్ గానీ రొమాంటిక్ గా ఉంది. ఈ సాంగ్ లో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య మధ్య రొమాంటిక్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే అనన్య ఈ పాటలో అందాలను ఆరబోస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రోమోతోనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక పాట రిలీజ్ అయితే సినిమాపై అంచనాలు మరింత పెరిగేట్టు ఉన్నాయి.

- Advertisement -

https://youtu.be/9jbRCSZHodM

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు