Boyapati : రామ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ !

టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్అంటే గుర్తు వచ్చేది బోయపాటి శ్రీను. సింహ, లెజెండ్, సరైనోడు, సినిమాలతో మాస్ డైరెక్టర్ గ పేరు తెచ్చుకున్నాడు బోయపాటి. పొలిటికల్ నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. లెజెండ్, సరైనోడు సినిమాలు ఒకరకంగా పొలిటికల్ డ్రామాలే. ఇప్పుడు హీరో రామ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా పూర్తిస్థాయి రాజకీయ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. రామ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుత సమకాలిన రాజకీయాలు, జనం తరచూ మాట్లాడుకునే రాజకీయ వ్యవహారాలు, సంఘటనలు, ఇవన్నీ సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో పొలిటికల్ పంచులు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట.

అయితే ఏది ఎలా ఉండగా ఈ పాన్ ఇండియా సినిమాలో మరో బాలీవుడ్ హీరో కీలకపాత్రలోనటించబోతున్నారట. సీనియర్ హీరో సునీల్ శెట్టి ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. సునీల్ శెట్టి కారణంగా రామ్ సినిమాకి బాలీవుడ్ లో ప్లస్ కానుంది. అన్నట్టు ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేల అదిరిపోయే ఐటెం సాంగ్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని ఇప్పటికే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీ తో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు