Birthday Special: కమెడియన్ సునీల్ ఆస్తి ఎంతో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ అని పేరు తెచ్చుకున్న అతి తక్కువ మంది నటుల్లో సునీల్ ఒకరు. దాదాపుగా 200 సినిమాల్లో నటించిన సునీల్, విలన్ అవ్వాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఒకే రూంలో ఉంటూ అవకాశాల కోసం ఎదురుచూశారు. విలన్ గా అవకాశాలు రాకపోవడంతో, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి, కమెడియన్ గా మారారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా సునీల్ ఎదిగారు. అందాల రాముడు, మర్యాద రామన్నా, పూల రంగడు లాంటి సినిమాల్లో హీరోగా కూడా చేశాడు.

కాగా నేడు కమెడియన్ సునీల్ తన 49వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఆస్తి ఎంతో ఉందో చూద్ధాం. సునీల్ ఇప్పటి వరకు దాదాపు 200 సినిమాల్లో నటించాడు. ప్రారంభంలో రెమ్యునరేషన్ తక్కువగా తీసుకున్నా.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో తీసుకుంటున్నాడు. గతేడాది సునీల్ ఏకంగా 13 సినిమాల్లో కనిపించాడు. ఒక్క రోజు సినిమా షూటింగ్ లో పాల్గొంటే.. సునీల్ దాదాపు రూ. 4 లక్షల వరకు పారితోషికం తీసుకుంటడట.

ఇలా సినిమాల ద్వారా సునీల్ దాదాపుగా రూ. 150 కోట్ల వరకు సంపాదించాడని తెలుస్తోంది. దీంతో పాటు జూబ్లీహిల్స్ లో రూ. 3 కోట్ల విలువ చేసే విలాసవంతమైన భవనం కూడా ఉందట. అలాగే 3 లగ్జరీ కార్లు కూడా సునీల్ వద్ద ఉన్నాయని సమాచారం. సునీల్ కు చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న డిమాండ్ కు మరిన్ని సినిమాల్లో నటించే ఛాన్స్ ఉంది.

- Advertisement -

ప్రస్తుతం సునీల్.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 లో కీలక పాత్ర చేస్తున్నాడు. దీంతో పాటు ఇటీవల కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళంలో ఈ స్టార్ కమెడియన్ నాలుగు సినిమాలకు సైన్ చేశాడు. అలాగే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు