Bimbisara-Karthikeya-2 : OTT రిలీజ్ ఎప్పుడంటే?

ఓటీటి లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా లవర్స్ మరింత ఖుష్ అవుతున్నారు. థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలన్నీ నెల రోజులకో లేక 50 రోజులకు ఓటీటి లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటి లో సినిమాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండు బ్లాక్ బాస్టర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలుస్తుంది. ఇటీవల టాలీవుడ్ లో బింబిసార, కార్తికేయ 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. చిన్న సినిమాలుగా వచ్చి ఊహించని విజయాలను నమోదు చేశాయి. వివిధ కారణాల వల్ల వీటిని థియేటర్స్ లో చూడని వాళ్ళు.. ఓటీటి లో ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రాల హక్కులను జీ 5 దక్కించుకుంది.

ఈ చిత్రాల విడుదలపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీంతో ఈ రెండు సినిమాలు ఓటిటి లోకి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చాలామంది జీ5 నిర్వాహకులను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన జి 5 ” మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.. ఈ సినిమాల ఓటిటి వివరాలకు మా సోషల్ మీడియా ఖాతాలను అనుసరించండి”. అని జి 5 తాజాగా ఓ ట్వీట్ చేసింది. అయితే బింబిసార సెప్టెంబర్ 23న లేదా 30న విడుదల చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కార్తికేయ 2 సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 5 న లేదా 7 న ఓటీటి లోకి రానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలు ఒకేసారి ఓటీటి లో సందడి చేయనుండడంతో ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు