Ram Charan X Allu Arjun : భిన్న అభిప్రాయాలు – విభిన్న పార్టీలు

Ram Charan X Allu Arjun : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి సెగలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఫలితం ఎటువైపు ఉంటుందని చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు చాలామంది ప్రజానీకం. అయితే సినిమాలకి పాలిటిక్స్ కి పెద్దగా సంబంధం లేకపోయినా కూడా రీసెంట్ టైమ్స్ లో ఈ రెండింటికి మధ్య సంబంధం బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ అంతటి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కెలికేసాయి అని చెప్పొచ్చు. కొన్ని కోట్లు పెట్టి సినిమాలను నిర్మిస్తే ఆ సినిమా టికెట్లు కి సరైన రేట్లు ఉండకపోవటం వలన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాట్లాడిన సంగతి తెలిసిందే. సినిమా వాళ్లకు ఉండే ఇబ్బందులను కూడా వారి వద్దకు చేర్చిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని గవర్నమెంట్ ఉద్యోగుల్లో చాలామంది విధులు నిర్వహించడానికి థియేటర్ వద్దకు చేరిపోయేవారు. పవన్ కళ్యాణ్ రీసెంట్ టైమ్స్‌లో చేసిన మూడు సినిమాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. 2014లో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. అప్పటినుంచి ఇప్పటివరకు గెలుపుకి ఆస్కారం లేకపోయినా కూడా పార్టీని మాత్రం అలానే మైంటైన్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానంలో చాలామంది సెలబ్రిటీస్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇదివరకే మెగా హీరోలు చాలామంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. సాయి ధరంతేజ్, వైష్ణవ తేజ్ వంటి వారు డైరెక్ట్ గా పిఠాపురానికి వచ్చి పార్టీ తరపున ప్రచారం చేశారు. ఇకపోతే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసి తన మద్దతును తెలిపారు. ఇక రీసెంట్ గా రాంచరణ్ కూడా పిఠాపురం కి విచ్చేశారు.

- Advertisement -

ఇకపోతే అల్లు అర్జున్ నంద్యాలలోని తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. రవిచంద్ర కిషోర్ రెడ్డి అనే కాండేట్ కు సపోర్టుగా నంద్యాలకు వెళ్లి ప్రచారం చేయనున్నాడు అల్లు అర్జున్. అయితే ప్రచారానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే టైమ్ ఉండడంతో ఒక పక్క వైసీపీ పార్టీ తరపున అల్లు అర్జున్. మరోపక్క తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తరఫున జనసేన పార్టీకి రాంచరణ్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద జరిగే ఫైట్ ఇప్పుడు రాజకీయ ప్రచారాల్లో జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో ఒకరిని మించి ఒకరు ట్విట్స్ చేస్తూ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు