OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న మరో మలయాళ మూవీ..!

OTT: ప్రస్తుత కాలంలో మలయాళం నుంచి వచ్చిన సినిమాలు ఎంతటి విజయవంతం అవుతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. 2024 మలయాళ సినిమాలకి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ప్రేమలు, ది గాట్ లైఫ్, మంజుమ్మల్ బాయ్స్ ఇలా ప్రతి ఒక్క సినిమా కూడా మలయాళ ఇండస్ట్రీకి చెందినదే. ఈ సినిమాలన్నీ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.

ఇక తాజాగా ఓటీటీలోకి మరో మలయాళం సినిమా వచ్చింది. ప్రస్తుతం ఆ సినిమా ఓటిటిని షేక్‌ చేస్తుంది కూడా. ఆ సినిమా పేరు ఆవేశం. టాలెంటెడ్ నటుడు ఫహీద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ మూవీని జిత్తు మాధవన్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీ భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. అయితే ఈ మూవీ రీసెంట్గా ఓటిటి లో కూడా విడుదలైంది. కేవలం ఒరిజినల్ మలయాళం లోనే వచ్చిన ఈ మూవీ ఇప్పుడు అదరగొడుతుంది.

Aavesham movie ott updates
Aavesham movie ott updates

ప్రైమ్ వీడియోలో వచ్చిన ఈ సినిమా కొంత సమయంలోనే నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. అదేవిధంగా ఈ సినిమాని ఓటీటీలో వీక్షించేవారు కూడా మంచి రెస్పాన్స్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన సమయంలో కొంచెం నెగటివ్ టాక్ అందుకున్నప్పటికీ అనంతరం నుంచి పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు