Chennakesava Reddy: మరో సారి

ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది అని చెప్పొచ్చు. ఒక మంచి సినిమా రిలీజైతే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు అని నిరూపించడమే కాకుండా, సినిమా బాగుంటే అది పాతదైనా కొత్తదైనా కూడా అదే మాదిరిగా థియేటర్ కి జనాలు వస్తారని ఈ మధ్యకాలంలో మరోమారు రుజువైంది.

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా వేసిన ఒక్కడు, పోకిరి చిత్రాలకు అనూహ్య స్పందన లభించింది. ఒక కొత్త సినిమాకి ప్రేక్షకులు వచ్చినట్లు వచ్చారు ఆ సినిమాలకు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తమ్ముడు, జల్సా చిత్రాలకు అంతకు మించి ప్రేక్షకులు, అభిమానులు థియేటర్స్ కి తరలి వచ్చారు. రీసెంట్ గా తమిళ్ స్టార్ హీరో ధనుష్ “త్రీ” మూవీకి కూడా మంచి స్పందన లభించింది.

ఇప్పుడు మరోసినిమా అలా రాబోతుంది, వి.వి. వినాయక్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “చెన్నకేశవరెడ్డి” చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 2002 సెప్టెంబర్ 25 న రిలీజైన “చెన్న కేశవరెడ్డి” చిత్రం 20 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది, ఈ సందర్బంగా మళ్ళీ ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు