Balakrishna : వీడియో వైరల్

నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. గ‌త ఏడాది బోయ‌శ్రీ‌ను శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖండ సిసినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత బాల‌య్య వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్నారు. NBK 107 మూవీ గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా త‌రువాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌నున్నాడు.

మ‌రోవైపు ఇటీవ‌లే మాస్ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌తో ఓ సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్లు ట‌ర్కీలో షూట్ చేస్తున్నారు. బాల‌య్య అభిమానులు షూటింగ్ స్పాట్‌లో సెల్పీలు, వీడియోలు తీస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే NBK 107 షూటింగ్‌కి సంబంధించిన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఇందులో బాల‌య్య‌-రౌడీల‌కు మ‌ధ్య జ‌రిగిన ఫైటింగ్ ఉంది.

ఒక స‌న్నివేశంలో బాల‌య్య ఒక రౌడీ చేతిని న‌రికివేయ‌గా మిగ‌తా రౌడీలు క‌త్తుల‌తో క‌నిపిస్తారు. బ్లాక్‌ష‌ర్టులో బాల‌య్య లుక్ అదుర్స్ అనేవిధంగా ఉంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 30 సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియో చాలా బాగుంద‌ని నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో ఈ సీన్ ఎక్క‌డ వ‌స్తుందో కానీ థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లేలా చేస్తుంద‌ని మ‌రికొంద‌రూ కామెంట్లు పెడుతున్నారు. బాల‌య్య‌కు జంట‌గా శృతిహాస‌న్ న‌టించింది. మైత్రీ మూవీస్ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. అఖండ త‌రువాత వ‌చ్చే సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అభిమానుల అంచ‌నాల త‌గ్గ‌ట్టు బాల‌య్య సినిమా ఆక‌ట్టుకుంటుందా లేక నిరాశ ప‌రుస్తుందా అనేది తెలియాలంటే ఈ సినిమా విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు