Balakrishna : బాలయ్య మనోభావాలు

నందమూరి నటసింహం బాలయ్య ఈ ఏడాది ప్రారంభంలో అఖండ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి అనే చిత్రం చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, బ్యాలెన్స్ సీన్స్ తో పాటు ఒక సాంగ్ ను చిత్రీకరిస్తుంది. ఇది అయిపోయిన వెంటనే గుమ్మడికాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.

దీంతో ప్రమోషన్లు ఇది వరకే చిత్ర యూనిట్ ప్రారంభించింది. అందులో భాగంగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్స్ గ్లింప్స్ తో పాటు “జై బాలయ్య..” “సుగుణా సుందరి..” సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. థమన్ అందించిన మ్యూజిక్ పాటలకు అందాన్ని తీసుకువచ్చాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలకు సిద్దమవుతుంది. శుక్రవారం రాత్రి “మా బావా మనోభవాలు..” అంటూ సాగే సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

ఈ ప్రోమో చూస్తూంటే ఇది ఐటెం సాంగ్ అయి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో బాలయ్య వేసిన మాస్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ పాటలో హీరోయిన్ చంద్రిక రవితో పాటు హానీ రోజ్ కూడా బాలయ్య తో స్టెప్స్ వేస్తోంది. ఇద్దరు హీరోయిన్లు తమ అందాలతో అభిమానులకు హిట్ ఎక్కించడం ఖాయమని తెలుస్తోంది. కాగా మా బావ మనోభవాలు పూర్తి సాంగ్ ను శనివారం 3:09 గంటలకు విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు